Politics

గన్నవరంలో రాత్రంతా హైడ్రామా.. పోలీసు వాహనంలోనే పట్టాభి.. నేడు నిర్ణయం తీసుకోనున్న జడ్జి..

గన్నవరంలో రాత్రంతా హైడ్రామా.. పోలీసు వాహనంలోనే పట్టాభి.. నేడు నిర్ణయం తీసుకోనున్న జడ్జి..

గన్నవరంలో హైడ్రామా కొనసాగుతోంది. తెల్లవారుజామున 3గంటలకు టీడీపీ నేత పట్టాభిని మరోసారి గన్నవరం పోలీస్‌స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు.

గన్నవరంలో హైడ్రామా కొనసాగుతోంది. తెల్లవారుజామున 3గంటలకు టీడీపీ నేత పట్టాభిని మరోసారి గన్నవరం పోలీస్‌స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఆయన ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఇంటిముందే సుమారు గంటసేపు వాహనంలో వెయిట్ చేశారు. అనంతరం పట్టాభిని పీఎస్‌కి తరలించారు. తెల్లవారిన తర్వాత పట్టాభి మెడికల్ రిపోర్ట్ సైతం మేజిస్ట్రేట్ కు సమర్పించి.. జడ్డి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు.

గన్నవరం దాడుల్లో పట్టాభితోపాటు టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు..

రిమాండ్‌కు తరలించే ముందు పట్టాభికి చికిత్స అందించాలని మేజిస్ట్రేట్‌ను కోరారు టీడీపీ నేతలు. దీంతో పట్టాభిని విజయవాడ ఆస్పత్రికి తరలించాలని జడ్జి ఆదేశించారు. చికిత్స కోసం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ ఆస్పత్రికి పట్టాభిని తరలించారు. ఈకేసులో మిగిలిన 10 మంది గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. పట్టాభి చికిత్స రిపోర్ట్ మేజిస్ట్రేట్ చూశాక తుదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటారు. పట్టాభి మెడికల్ టెస్టుల రిపోర్ట్స్ ను బట్టి ఇవాళ రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం లేకపోలేదు. అంతకుముందు కోర్టుకు హాజరైన పట్టాభి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది కోర్టు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మేజిస్ట్రేట్ ముందు చెప్పారు పట్టాభి.

ఇక తన భర్త అరెస్ట్, ఆచూకీ కోసం పట్టాభి భార్య చందన నిరసనకు దిగారు. గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఇంట్లోనే తన భర్తతో వీడియో కాల్ మాట్లాడించాలని నిరసనకు దిగారు. అటు పట్టాభి కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని పోలీసులే ప్రోత్సహించారని మండిపడ్డారు. బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

మరోవైపు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి అటు గన్నవరం, ఇటు విజయవాడ. టీడీపీ ఆఫీస్‌పై వల్లభనేని వంశీ అనుచరుల దాడి సెగలు విజయవాడకూ పాకడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. బెజవాడ NTR సర్కిల్‌కు వెళ్లేందుకు టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన ప్రయత్నం కూడా టెన్షన్ క్రియేట్ చేసింది. నిన్న ఉదయం నుంచే ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. కర్రలతో సిద్ధమైన వెంకన్న టీమ్‌ను బయటకురాకుండా అడ్డుకున్నారు.

అటు టీడీపీ పిలుపునిచ్చిన ఛలో గన్నవరం కార్యక్రమాన్ని భగ్నం చేశారు పోలీసులు ముందుజాగ్రత్తగా పలువురు నేతల్ని హౌస్‌అరెస్ట్ చేశారు. బయటివాళ్లు గన్నవరానికి రాకుండా చర్యలు చేపట్టారు. మొత్తం 300 మంది పోలీసుల్ని మోహరించారు. 12 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రతి వెహికిల్‌ను తనిఖీ చేశారు. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు.