Business

మరో వివాదం లో అదాని..

మరో వివాదo లో అదాని..

షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొన్న అదానీ గ్రూపునకు.. తాజాగా వికిపీడియా నుంచి కూడా ఆరోపణల సెగ తాకింది.సాక్పప్పెట్స్ను ఉపయోగించుకొని గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం, అదానీ గ్రూపునకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని వికిపీడియా ఆరోపించింది. దశాబ్దకాలం పైగా నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది.
ఇందుకోసం సాక్పప్పెట్గా తన సంస్థలోని ఉద్యోగులనే అదానీ గ్రూపు వాడుకుందని పేర్కొంది. వికీపీడియాలో..ఎవరైనా ఏదైనా పేజీని ఎడిట్ చేయొచ్చు.. లేదా సమాచారాన్ని తక్షణమే మరింత పొడిగించవచ్చు. అయితే ‘తటస్థ వైఖరి’ అనే నియమానికి కట్టుబడి ఈ మార్పులు చేయాలి.సాక్పప్పెట్స్ అంటే..: ఏదేని ఒక సమాచారంపై వాదించేందుకు, సమీక్షించేందుకు ఆన్లైన్ యూజర్ సృష్టించుకునే ఐడెంటిటీ లేదా పేరును సాక్ప్ప్పట్గా వ్యవహరిస్తారు. సాక్పప్పెట్ అకౌంట్లను ఉపయోగించుకొని పేరు బయటకు వెల్లడించని పెయిడ్ ఎడిటర్లతో అదానీ గ్రూపు కథనాలు రాయించుకున్నారని వికీపీడియా ఆరోపించింది. అదానీ కుటుంబం, గ్రూపు సంస్థలపై ఇప్పటికే రాసిన కథనాల్లో సవరణలు చేయడం లేదా కథనాలను తిరిగి రాయడం చేశారని పేర్కొంది.

సాక్పప్పెట్స్ అంటే.:

ఏదేని ఒక సమాచారంపై వాదించేందుకు, సమీక్షించేందుకు ఆన్లైన్ యూజర్ సృష్టించుకునే
ఐడెంటిటీ లేదా పేరును సాక్పప్పెట్గా వ్యవహరిస్తారు. సాక్పప్పెట్ అకౌంట్లను ఉపయోగించుకొని పేరు బయటకు వెల్లడించని పెయిడ్ ఎడిటర్ తో అదానీ గ్రూపు కథనాలు రాయించుకున్నారని వికిపీడియా ఆరోపించింది. అదానీ కుటుంబం, గ్రూపు సంస్థలపై ఇప్పటికే రాసిన కథనాల్లో సవరణలు చేయడం లేదా కథనాలను తిరిగి రాయడం చేశారని పేర్కొంది.’40 మందిని బ్లాక్ చేశాం’: ‘అదానీ కుటుంబం, వ్యాపారాలపై తొమ్మిది వ్యాసాలు రాసిన లేదా సవరించిన 40 మందికి పైగా సాక్పప్పెట్స్ లేదా అని డిక్లేర్డ్ పెయిడ్ ఎడిటర్స్ను బ్లాక్ చేశాం. వీళ్లలో చాలా మంది వ్యాసాలను ఎడిట్ చేయడమే కాకుండా, నాన్- న్యూట్రల్ (తటస్థ రహిత) సమాచారాన్ని చేర్చారని వికిపీడియా తెలిపింది. అయితే సాక్పప్పెట్స్ అదనంగా చేర్చిన వివరాలను మాత్రం వికిపీడియా వెల్లడించలేదు.ఈ వ్యవహారంపై అదానీ గ్రూపు అధికార ప్రతినిధి నుంచి స్పందన కోరగా.. ఎటువంటి సమాధానం రాలేదు.
‘అదానీలపై ఆర్టికల్ రాయడం 2007 నుంచి ప్రారంభమైంది. కానీ 2012 నాటికి ముగ్గురు ఎడిటర్లు దాతృత్వం విభాగంలో సమాచారాన్ని మార్పులు చేశారు. అయితే వీళ్లను ఆ తర్వాత సాక్పప్పెట్స్ లేదా అన్ఎకేర్డ్’ ‘పెయిడ్ ఎడిటర్లుగా గుర్తించి బ్లాక్ చేయడం లేదా నిషేధించామని వికీపీడియా తెలిపింది. అదానీ కుటుంబం, గ్రూపు సమాచారం పైనా ఇదే తరహా ఘటనలను జరిగాయని పేర్కొంది. వికీపీడియా నాణ్యతా నియంత్రణ నిబంధనలకు
విరుద్ధంగా కూడా కొందరు ఆర్టికల్స్న రాశారని పేర్కొంది.