సీబీఐ కౌంటర్లో సంచలన విషయాలు – వివేకా హత్య రోజు నిందితులందరూ భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారు – ఘటనాస్థలిలో సాక్ష్యాలను చేరిపివేయడంలో కూడా అవినాష్‌రెడ్డి పాత్ర – ఈ హత్య కేసులో నిందితులు సునీల్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి.. ఉదయం 5:20 నిమిషాలకు భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు – వీరి ముగ్గురి ప్రమేయం బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు – నిందితుడు శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు – వివేక మృతి విషయాన్ని తెలుసుకొని అవినాష్‌రెడ్డితో పాటు శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి పీఏ, రాఘవరెడ్డి పీఏ చేరుకున్నారు – బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకాను చూసి గుండెపోటుతో మరణించారని స్థానిక నేత శశికళకు సమాచారమిచ్చారు – ఆ తర్వాత అవినాష్‌రెడ్డి తన సెల్‌ఫోన్ నుంచి రెండు నెంబర్లకు కాల్ చేసి వివేకా మృతిపై సమాచారం అందించారు – దీనికోసం పీఏ రాఘవరెడ్డి ఫోన్ కూడా ఉపయోగించినట్లు గుర్తించాం – వివేకాపై భారీగా రక్తపు మరకలు, గాయాలు స్పష్టంగా చూసినప్పటికీ ఘటనాస్థలానికి త్వరగా రావాలని సీఐని అవినాష్‌రెడ్డి కోరలేదు – వివేకా గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులు కావడంతోనే సహజంగా మరణించారంటూ డ్రామా క్రియేట్ చేశారు : సీబీఐ