NRI-NRT

న్యూ జెర్సీ. సాయి దత్త పీఠంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

న్యూ జెర్సీ. సాయి దత్త పీఠంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

సాయిదత్తపీఠం కల్పతరువుకు చక్కటి స్పందన
శ్రీ శివ, విష్ణు ఆలయంలో అరుదైన కల్పతరు వృక్షం
అంగరంగ వైభవంగా మహా శివరాత్రి వేడుకలు

ఎడిసన్: ఫిబ్రవరి 19: అమెరికాలో హిందు ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఈ నెల 18, 19 లలో అంగరంగ వైభవంగా మహా శివరాత్రి పర్వదిన వేడుకలు నిర్వహించారు.

శివ విష్ణు ఆలయం ఓ కొలువై ఉన్న పంచముఖ పరమేశ్వరుని, అమరేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు విచ్చేసి ఈ రెండు రోజులు జరిగిన ప్రధమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ కాల అభిషేకాలలో బిల్వ అష్టోత్తర శతనామార్చన, 11 సార్లు రుద్ర పారాయణ, సహస్రనామార్చన, లలితా రుద్ర త్రిశతి నామార్చన, నందీశ్వర పూజ, హారతి, మంత్రపుష్ప పూజలలో పాల్గొన్నారు.
సాయంత్రం శ్రీ శివ పార్వతుల కళ్యాణాలలో న్యూ జెర్సీ, న్యూ యార్క్, ఫిలడెల్ఫియా రాష్ట్రాల పరిసర ప్రాంతాలనుండి విశేషం గా భక్తులు పాల్గొని స్వామి, శ్రీ మాత కృపకు పాత్రులయ్యారని సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి తెలియచేసారు. 6 వేల మందికి పైగా భక్తులు
ఈ శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నదాన టీం మహా ప్రసాదాన్ని అందించారు.

ఆలయంలో ప్రతిష్టాత్మక కల్పతరువు ఆకృతి నిర్మాణం భక్తుల సందర్శనార్థం దిగ్విజయంగా ఏర్పాటు చేయబడింది. ఎడిసన్‌లో సాయి దత్త పీఠం నిర్మించిన శ్రీ శివ, విష్ణు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన ఈ కల్పతరువు కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. కల్పతరువు కార్యక్రమం విరాళాలు ఇచ్చిన వారికి పేర్లను లోహపు రేకులపై ఆకుల రూపంలో చెక్కి ఆ ఆకులతో కల్పవృక్ష ఆకృతిని రూపొందించారు. న్యూ జెర్సీ ప్రముఖులు ఉపేంద్ర చివుకుల చేసిన ఈ కల్పతరు ఆవిష్కరణ
సాయి దత్త పీఠం బోర్డ్ సభ్యులు, పలువురు భక్తుల సమక్షం లో జరిగింది.
ఈ ఆకృతిని ఆలయ గోడపై ప్రతిష్టించారు. ఇలా ఆ దేవదేవుడికి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు చిరకాలం నిలిచిపోయేలా ఉంటుందని ఈ రోజు వరకూ పాల్గొన్న దాతల వివరాలు లోహపు రేకులపై ఏర్పాటు చేయబడ్డాయని, ఇంకా పాల్గొనని భక్తులకు ఇదొక సువర్ణావకాశమని తెలియచేశారు.

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంలా ఉండాలనేది సాయిదత్త పీఠం ఆకాంక్ష అని, తర తరాలకు ఆ సాయి దత్త పీఠం నిర్వాహకులు శ్రీ రఘుశర్మ శంకరమంచి అన్నారు. కల్పతరు వృక్షానికి పూజలు చేసి భక్తులు సాయి దత్త పీఠంపై చూపిస్తున్న ఆదరణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.