Politics

బీజేపీ ఎన్నికలు జరిగే వరకు అధ్యక్షుడుగా బండి సంజయ్

బీజేపీ  ఎన్నికలు జరిగే వరకు అధ్యక్షుడుగా బండి సంజయ్

హైదరాబాద్ : బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా బండి సంజయ్​ కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. వచ్చే నెల 11వ తేదీతో బండి సంజయ్ మూడేళ్ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంలో బండిసంజయ్​ను మళ్లీ అధ్యక్ష పదవిలో కొనసాగించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.