తెలుగు రాష్ట్రాల అగ్రి స్టార్టప్లకు కేంద్రం గుర్తింపు
దేశంలో వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేస్తున్న 75 స్టార్టప్ జాబితాను నీతిఆయోగ్ తాజాగా విడుదల చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు స్టార్టప్ లకు చోటు లభించింది. రైతునేస్తం ఫౌండేషన్, ఆక్వా ఎక్స్ఛేంజ్, కార్నెక్స్ట్, మిల్లెట్ బ్యాంక్ సంస్థలకు ఈ జాబితాలో చోటు దక్కింది. వ్యవసాయం, ఉద్యానవనం, డెయిరీ, పశుసంవర్ధకం, మత్స్యరంగాల్లో అన్నదాతలకు అందిస్తున్న సేవలకు ఈ గుర్తింపు లభించింది.