Devotional

భయం.. భయం.. దానిని జయించటం ఎలా.???

భయం.. భయం.. దానిని జయించటం ఎలా.???

🌿భయం’ అనే పదం వినగానే చాలామందికి ఏదో తెలియని భయం.   
🌿రేపటి రోజు ఏమవుతుందోననే భయం.
🌿ఒకరిదైతే, ఉద్యోగం దొరుకుతుందో లేదోనని మరొకరి భయం.       
🌿వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారనే భయం ఇంకొందరిది.
🌿కష్టపడి సంపాదించిందంతా రేపు ఏమవుతుందనే భయంతో కూడా కొందరు సతమతమవుతూ ఉంటారు.
👉ఇలా ప్రతి ఒక్కరూ ఏదో రకమైన భయంతో ఉంటారు.
🌿రెండేళ్ళ నుంచీ కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన భయాలను చూసి ఉన్నాం. నిరుపేదల నుంచి సంపన్నుల వరకూ… అన్ని వర్గాలవారూ దాని ప్రభావానికి గురయ్యారు. 

👉మనకు ఎదురయ్యే అనేక భయాల నుంచి ఎలా బయటపడాలి?
👉దానికోసం మనం ఏం చెయ్యాలి?

ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని మనం వీడి పోవాలనే విషయం అందరికీ తెలిసిందే.

👉‘పరీక్షలో పాసవుతామో? లేదో?’ అని భయపడతాం కాని, ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి పోవాలని, ఏదీ తనతో రాదని… ఈ భయం మనకు ఎన్నడూ కలగడం లేదు.

🌿మిగతా విషయాలలో కలిగే భయాలు, భ్రాంతులు మానవ కల్పితాలు.

🌿చావు ప్రకృతిపరమైన భయం. దాన్ని మనం అంగీకరించడం లేదు. వాస్తవాన్ని స్వీకరించడం లేదు. అలాగే మనలో ఉన్న శ్వాస తాలూకు ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ఆగిపోతే మళ్ళీ తిరిగి రాదు. కానీ ఆ విషయంలో మనం భయపడడం లేదు. 

🌿కోటానుకోట్ల  సంపద ఉన్న మనుషుల్లో కూడా సంతోషం లేదు. సంతృప్తి కరువైంది. వీటన్నిటికీ కారణం సమాజం వల్ల నెలకొన్న భయమే.

👉జరగబోయే వాస్తవాన్ని తెలుసుకుంటే కలిగేది ఒక రకమైన భయం. కానీ దాని గురించి భయపడినా లాభం లేదు. ఎందుకంటే… దాన్ని మనం అంగీకరించకపోయినా ఎలాగూ జరిగేదే.

👉👉కానీ మనలో నిరంతరం ఉండే మరో రకమైన భయం… సమాజం వల్ల కలిగేది. దాన్ని వదిలించుకోవాలి. పరిస్థితులు ఎంతగా తారుమారైనా… మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం మన జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. ఆ ఆనందమయ స్థితికి మనం ప్రతిరోజూ చేరుకోవాలి. దానికోసం భయాన్ని దూరం చేసుకోవాలి. 
 
👉శాశ్వతమైనదీ, అనంతమైనదీ అయిన శక్తి ఒకటుంది. అదే సత్యం. అది అంతటా వ్యాపించి ఉంది. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ నడిపిస్తోంది.

🌿మనం ఒకప్పుడు లేము. ఇప్పుడు ఉన్నాం. ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలి పోతాం. అందరి జీవితాల్లోనూ ఇది మాత్రమే తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరూ దేన్నీ తీసుకువెళ్ళలేరు… అసలైన శాంతిని తప్ప. అంతర్గతమైన ఆ శాంతిని పొందాలంటే… ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న ఆ దివ్య శక్తిని అర్థం చేసుకోవాలి. మన ఉనికి ఏమిటనేది గుర్తించాలి. అలా జరిగినప్పుడే మనలోని భయం మీద విజయం సాధించగలం.🍁