Politics

సోము వీర్రాజును పదవి నుండి దించకుంటే భాజాపాకు అధోగతే

సోము వీర్రాజును పదవి నుండి దించకుంటే భాజాపాకు అధోగతే

కన్నా బీజేపీ ని వీడి టీడీపీ లోకి వెళ్లడం తో… బీజేపీ నాయకులు మేలుకుంటున్నారు.. కన్నా వెళ్లిపోవడం బీజేపీ కి నష్టమే అని కొందరు బీజేపీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.. కన్నా పార్టీ విడడడానికి సోము వీర్రాజు కారణం అని భావిస్తున్నారు.. అనుకున్నదే తడువు గా కొందరు ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లి మురళీధర్ ను కలిసి సోము వీర్రాజు ను అధ్యక్షుడు నుండి తొలగించాలని.. కొత్త కమిటీ లు నియమించాలని కోరారు.. అంతే కాకుండా ఏపీ లో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా వివరించినట్టు సమాచారం.. అలసత్వ వహిస్తే కన్నా లాగే మరికొందరు తలోదారి చూసుకొనెల ఉన్నట్టు సమాచారం అందించినట్లు సమాచారం.. అలాగే ఏపీ బీజేపీ లో రెండు వర్గాలు ఉన్నట్టు కూడా వివరించినట్టు టాక్.. పైకి అంతా బాగానే ఉన్నా.. లోపల మాత్రం అసంతృప్తి గళం పెద్ద లిస్ట్ ఉన్నట్టు టాక్.. పురంధేశ్వరి, మాజీ ఎం.ఎల్. ఏ విష్ణు లు సైతం టీడీపీ వైపు చూస్తున్నారని టాక్.. సోము ని మార్చకపోతే కష్టమే అని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది… సోము, జీవిల్, సునీల్ , విష్ణు వర్ధన్ రెడ్డి వర్గాలు జగన్ కు కోవర్ట్ గా వ్యవహరిస్తూ యాంటీ టీడీపీ వర్గం గా మరెరని దీని వల్ల అధికార పార్టీ తప్పులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలమని కేంద్ర పెద్దల వద్ద వాపోయినట్టు సమాచారం..కేవలం సత్యకుమార్, విష్ణు కుమార్ రాజు లు మాత్రమే వైకాపా పై పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తున్నారని.. మిగతా వారు సాఫ్ట్ కార్నర్ లో వ్యవహరిస్తున్నారని బీజేపీ పెద్దలకు ముఖ్యనాయకులు తెలిపినట్టు సమాచారం.. ఇలా ఐతే కష్టం అని.. త్వరగా చర్యలు చేపట్టి ఏపీ బీజేపీ ని ఓ గాడిలో పెట్టాలని కోరినట్టు సమాచారం.. అలాగే ఏపీ బీజేపీ లో మరో వర్గం టీడీపీ తో పొత్తు తేల్చాలని..పొత్తు ఉంటే ఫలితం ఉంటుందని వదిస్తున్నట్లు సమాచారం.. మరో వర్గం బీజేపీ జనసేన తో మాత్రమే వెళ్తే బాగుంటుందని.. జనసేన తప్పుకుంటే ఒంటరిగానే బలపడలని సూచిస్తున్నట్లు సమాచారం..