Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *24.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (24-02-2023)

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో
కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (24-02-2023)

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి
ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఆవరిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (24-02-2023)

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో
సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (24-02-2023)

సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో
అనుకూలత ఉంది. ముఖ్యమైన సందర్భాలలో పెద్దల ఆశీర్వచనాలు రక్షిస్తాయి. మహాలక్ష్మి సందర్శనం
శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (24-02-2023)

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో
కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (24-02-2023)

పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి. బంధు, మిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల*
ఈరోజు (24-02-2023)

మీ మీ రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (24-02-2023)

మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారంలో
మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై
విజయం సాధిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సునిస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (24-02-2023)

మనోబలంతో ముందుకు సాగండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం
వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (24-02-2023)

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు, వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. శ్రీవేంకటేశ్వర
| స్వామి సందర్శనం ఉత్తమం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (24-02-2023)

పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు.
ఎవరితోనూ విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (24-02-2023)

చేపట్టే పనుల్లో మిశ్రమ ఫలాలు ఉంటాయి.
మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో వైరసూచన. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈