ఇప్పుడంటే మనం ప్లాస్టిక్, స్టీల్, పింగాణీ, పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తున్నాం కానీ, ఒకప్పుడైతే మన పూర్వీకులు అరిటాకుల్లోనే భోజనం చేసే వారు. అందుకు కారణం లేకపోలేదు. అరిటాకులో భోజనం చేయడం వల్ల దాంతో మనకు ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. అందుకే ఇప్పటికీ కొందరు అరిటాకుల్లోనే భోజనం చేస్తుంటారు. కొన్ని హోటల్స్‌లోనూ మనం ఇలాంటి పద్ధతిని చూసి ఉంటాం. ఈ క్రమంలో అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చటి అరిటాకులో వేడి వేడి ఆహారపదార్థాలు వడ్డించడంవల్ల ఆకుపైన ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి మంచి రుచి వస్తుంది. దీంతో భోజనంలో చక్కని రుచిని ఆస్వాదించవచ్చు.అరిటాకుకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వేడి పదార్థాలు ఆ ఆకుపైన పెట్టుకుని తిన్నప్పుడు ఆకులోని విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. వేడి వేడి పదార్థాలు అరిటాకులో తినడం వల్ల కఫ, వాతాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరం కాంతిమంతమవుతుంది. ఆకలిపుడుతుంది. ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి అరిటాకులో ఉంది. అరిటాకుల్లో తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. అరిటాకులో భోజనం చేయడం వల్ల అందులోని పోషకాలు శరీరంలోకి చేరి తద్వారా శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. వెంట్రుకలు నల్లబడతాయి. తెల్లని జుట్టు ఉన్నవారు అరిటాకులో భోజనం చేస్తుంటే వారి జుట్టు క్రమంగా నల్లబడుతుంది. అరిటాకులో భోజనం పెట్టినప్పుడు, ఒకవేళ విషాహారం పెడితే, అరిటాకు నల్లగా మారిపోతుంది. అన్నంలో విషం ఉందని బహిర్గతమైపోతుంది. అరిటాకుల్లో పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలు వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏదైనా పదార్థంలో ఉప్పు ఎక్కువైతే దాన్ని తినలేం. పారేస్తాం. అయితే అరిటాకు వల్ల అలా పారేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పదార్థం ఉన్న పాత్ర మూతను తీసి దాని స్థానంలో అరిటాకును పెట్టి కొంత సేపు మళ్లీ ఉడికించాలి. దీంతో ఉప్పు అంతా పోయి ఆహారం రుచిగా మారుతుంది.
అరటి పండ్లలోనే కాదు, అరటి ఆకుల్లోనూ పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఈ క్రమంలో అరిటాకులో భోజనం చేయడం వల్ల పొటాషియం అంది తద్వారా గుండె సంబంధ సమస్యలు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
అరిటాకుల్లో భోజనం ఎందుకు చేయాలంటే..?
