Business

ఎయిరిండియా విమానానికి ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

ఎయిరిండియా విమానానికి ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలను మిగుల్చుతున్నాయి. ఇటీవల నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదం 69 మంది ప్రాణాలు కోల్పోయారు. టెకాఫ్ అయిన కొద్ది సమయంలోనే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఇటీవల విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్నసమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం, రన్ వే పై ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. విమాన సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ ప్రమాదాలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తు ప్రయాణీకులను రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.

నెవార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజన్ లో నుంచి ఆయిల్ లీక్ అవ్వడం పైలట్లు గమనించారు. హుటాహుటిన స్వీడన్ లోని స్టాక్ హూమ్ ఎయిర్ పోర్ట్ లో విమానాన్ని ల్యాడ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఆయిల్ లీక్ కావడం వల్ల విమానానికి మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. మంటలు ఆర్పేందుకు విమానాశ్రయం వద్ద భారీగా ఫైరింజన్లను మోహరింపజేశారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ పై డీజీసీఏ అధికారి స్పందిస్తూ.. నెవార్క్ నుంచి ఢిల్లీ బయలు దేరిన ఏయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నట్లు సిబ్బంది గుర్తించి వెంటనే దాన్ని షట్ డౌన్ చేశారని.. వెంటనే స్టాక్ హూమ్ లో ల్యాండ్ చేశారని అన్నారు. టెక్నికల్ సమస్య ఎలా తలెత్తిందనే విషయంపై తనిఖీ చేస్తున్నామని అన్నారు.