ఈ ఏడాది ప్రారంభంలో చుక్కలను తాకిన బంగారం ధర క్రమంగా దిగి వస్తోంది. ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు బంగారం ధర తగ్గడమో.. స్థిరంగా ఉండటమో జరిగింది. ఇక శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. నేడు తులం బంగారం ధర ఎలా ఉంది అంటే.
బంగారం ధర తగ్గుతుండటంతో.. పసిడి ప్రియులకు గత కొన్ని రోజులుగా ఊరటగా ఉంది. ఇక గురువారం నాడు స్థిరంగా ఉన్న బంగారం రేటు.. శుక్రవారం నాడు భారీగా తగ్గింది. ఈ రోజు ఏకంగా తులం బంగారం మీద 220 రూపాయలు పతనం అయ్యింది. ఈ తగ్గుదల ఇలానే కొనసాగితే.. అతి త్వరలో బంగారం తులం ధరం 50 వేల దిగువకు పడిపోయే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక గత కొన్ని రోజులుగా పసిడి ధర తగ్గుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా బంగారం ధర పడిపో యింది. ఇక ఈ వారం రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 600 రూపాయల వరకు తగ్గడం విశేషం. నేడు హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510గా ఉంది. ఇక ఏపీ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,510 ఉంది. అలానే దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,610 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల బంగారం తులం రూ.56,510గా ఉంది.
స్థిరంగా వెండి ధర..
ఓవైపు పసిడి ధర పతనమవుతుండగా.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం వెండి ధర భారీగా పెరగ్గా.. శుక్రవారం మాత్రం వెండి ధర స్థిరంగా ఉంది. నేడు దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు.ఇక హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,800కాగా, ముంబైలో రూ. 68,800 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,500గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,500 వద్ద కొనసాగుతోంది.