Politics

AP ఆ నలుగురు మంత్రులు అవుట్..

AP ఆ నలుగురు మంత్రులు అవుట్..

ఆ ఏపీ నలుగురు మంత్రులకు డేంజర్ బెల్స్

మార్పు కు రంగం సిద్ధం

ఏపీలో మంత్రివస్తరణ జరగనుందా. ఎవరి పైన వేటు పడనుంది. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో ఇదే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగుతున్నాయి.
వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ – పాలనా పరంగా మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కేబినెట్ ప్రక్షాళన మరోసారి తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇందుకు ముహూర్తం ఖరారవుతుందని చెబుతున్నారు. నలుగురు మంత్రులు సీఎం అంచనాలను చేరుకోవటంలో విఫలమయ్యారని సమాచారం. వీరి స్థానంలో కొత్తగా ఎన్నిక అవుతున్న ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు తప్పించే మంత్రులు ఎవరు.. కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికనే చర్చ మొదలైంది.

నలుగురు మంత్రులను తప్పిస్తారంటూ

ఏపీ కేబినెట్ లో నలుగురు మంత్రులను తప్పిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వచ్చే నెల 14 నుంచి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టులో రాజధానుల కేసు పైన వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో కేబినెట్ లోనూ మార్పుల దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో నలుగురి మంత్రులను తప్పించి..వారి స్థానాల్లో ప్రాంతీయ – సామాజిక సమీకరణాలు దెబ్బ తినుకుండా కొత్త మంత్రులతో భర్తీ చేయనున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం వైసీపీ ప్రకటించిన 18 మంది ఎమ్మెల్సీల నియమాకాలు జరిగినట్లు చెబుతున్నారు. దీంతో..ప్రస్తుత కేబినెట్ లో తప్పించే నలుగురు మంత్రులు ఎవరనే దాని పైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నలుగురు ఎమ్మెల్సీలకు ఛాన్స్..
జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి కేబినెట్ లో ఇద్దరు మండలి సభ్యులకు అవకాశం ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణ ఎన్నికల్లో ఓడినా, వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రలను చేసారు. ఆ తరువాత ఆ ఇద్దరినే రాజ్యసభకు పంపారు. అప్పుడు తొలి సారిగా ఇద్దరు మంత్రులతో కేబినెట్ విస్తరణ జరిగింది. తన తొలి కేబినెట్ లో పని చేసిన వారికి రెండున్నారేళ్లు మాత్రమే మంత్రులుగా ఉంటారని..తరువాత కొత్త వారికి అవకాశం ఉంటుందని సీఎం స్పస్టం చేసారు. గత ఏడాది చేసిన విస్తరణలో 11 మంది పాతమంత్రులను కొనసాగించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు జరిగే విస్తరణలో నలుగురు కొత్త ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత దక్కే అవకావం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో మండలి నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. కానీ, ఇప్పుడు తీసుకొనే వారిలో మండలి నుంచి కొత్తగా ముగ్గురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

నలుగురు ఔట్..నలుగురు ఇన్
ప్రస్తుత కేబినెట్ లో ఒక మహిళా మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ స్థానంలో అదే జిల్లాకు చెందిన కోస్తా జిల్లాల్లో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అదే విధంగా అనేక వివాదాల్లో ప్రతిపక్షాలకు టార్గెట్ అయిన సీమ జిల్లాకు చెందిన మంత్రిని కూడా తప్పిస్తారని తెలుస్తోంది. ఆ మంత్రి స్థానంలో అదే జిల్లాలో..అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో వైఎస్సార్..ఇప్పుడు జగన్ కు విధేయుడిగా పేరుంది. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఒక యువ మంత్రిని తప్పిస్తారంటూ ప్రచరాం సాగుతోంంది. ఆ మంత్రి సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు తాజాగా ఎమ్మెల్సీని చేసారు. ఆ మంత్రి స్థానంలో ఈ సీనియర్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. గోదావరి జిల్లా నుంచి ఒక సీనియర్ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. అదే జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు ఇప్పుడు కేబినెట్ లోకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు జగన్ తీసుకొనే నిర్ణయాలు..అమలు చేసే సమీకరణాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.