తమ దేశంలో విద్యను అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు అమెరికా తీపి కబురు చెప్పింది.
విద్యాసంవత్సరానికి ఏడాది ముందుగానే వీసా
వాషింగ్టన్, ఫిబ్రవరి 24: తమ దేశంలో విద్యను అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు అమెరికా తీపి కబురు చెప్పింది. వారి విద్యాసంవత్సరం మొదలయ్యే ఏడాది ముందుగానే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. అయితే.. దేశంలోకి ప్రవేశం విషయంలో మాత్రం కోర్సు మొదలయ్యే 30 రోజులకంటే ముందు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలా ప్రవేశించాలంటే పర్యాటక వీసా ఉండాల్సిందేనని పేర్కొంది.