Sports

ఆస్ట్రేలియాదే మహిళ టీ20 ప్రపంచకప్

ఆస్ట్రేలియాదే మహిళ టీ20 ప్రపంచకప్

ఆస్ట్రేలియాదే అమ్మాయిల టీ20 ప్రపంచకప్‌. మేటి జట్టుగా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్న ఆ జట్టు పొట్టి ఫార్మాట్లో మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. బెత్‌ మూనీ (74 నాటౌట్‌; 53 బంతుల్లో 9×4, 1×6) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆతిథ్య జట్టు మంచి ప్రయత్నమే చేసినా ఫలితం లేకపోయింది. మూనీతో పాటు ఆష్లీ గార్డ్‌నర్‌ (29; 21 బంతుల్లో 2×4, 2×6) మెరవడంతో మొదట ఆసీస్‌ 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. షబ్నిమ్‌ (2/26), మరిజేన్‌ కాప్‌ (2/35) బంతితో రాణించారు. ఓపెనర్‌ లారా వోల్వార్ట్‌ (61; 48 బంతుల్లో 5×4, 3×6) మెరిసినప్పటికీ ఛేదనలో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. ఆష్లీ (1/20), మెగాన్‌ షట్‌ (1/23), డార్సీ బ్రౌన్‌ (1/25) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. మూనీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఆష్లీ గార్డ్‌నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచింది.