నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో తెలుగుదేశం అభిమానులు, సానుబూతిపరులు సంగీభావ సమావేశం నిర్వహించారు.
ముందుగా ఇటీవలే మర్ణించిన యువ హీరో తారకరత్న కు నివాళులు అర్పించారు.. ఎంతో భవిష్యత్ ఉన్న తారకరత్న చిన్న వయసులో నే గుండెపోటు తో తిరిగి రాని లోకాలకు వెళ్లడం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
తర్వాత జరిగిన సంగీభవ సమావేశం లో.. నారా లోకేష్ యువగలం పాదయాత్ర కు వస్తున్న అపూర్వ స్పందన ను చూస్తుంటే ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో తమకు అర్ధం అవుతుంది అని.. ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తూ.. కార్యకర్తలు కు భరోసానిస్తూ భారీ పాదయాత్ర చేప్పట్టడం అభినందనీయం అని తెలియజేసారు..
రాష్ట్రం లో అరాచక పాలన ను ప్రసినిస్తూ సాగుతున్న యువగలం పాదయాత్ర తో పాటు…మీడియా వారిని ప్రతిపక్ష పార్టీలను , ప్రజలు ను వేదించడం దుర్మార్గం అని వీటిని తీవ్రంగా కండిస్తున్నాం అని Nri టీడీపీ అడిలైడ్ తెలియజేస్తున్నది.