ScienceAndTech

వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేయవచ్చు!

వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సెండ్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేయవచ్చు!

యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎడిట్ (Edit) ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చే పనిలో పడిందని తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. యూజర్లు పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి వీలుగా ఈ అప్‌కమింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుత యూజర్లను నిలుపుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించేందుకు వాట్సాప్ (WhatsApp) నిత్యం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా వాట్సాప్ చాలా ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమైంది. కాగా యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎడిట్ (Edit) ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చే పనిలో పడిందని తాజాగా వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. యూజర్లు పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేయడానికి వీలుగా ఈ అప్‌కమింగ్ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది.

ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వాట్సాప్ బీటా వెర్షన్‌ల కోసం అభివృద్ధి చేస్తున్నారు. వాట్సాప్ డెవలపర్లు iOS వెర్షన్‌లో కూడా దీనిని తీసుకురావడానికి పనిచేస్తున్నారు. కొత్త ఫీచర్ యూజర్లకు తప్పులను సరిదిద్దడానికి లేదా వారి ఒరిజినల్ మెసేజ్‌కు ఎక్స్‌ట్రా ఇన్ఫో జోడించడానికి సహాయ పడుతుంది.

iOS 23.4.0.72 WhatsApp బీటా అప్‌డేట్.. కంపెనీ ఈ ఫీచర్‌పై పని చేస్తోందని చూపించింది. ఈ ఫీచర్ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా వాట్సాప్ బీటా ఇన్ఫో షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌ ప్రకారం, వాట్సాప్‌లో ఒక ఎడిటెడ్ మెసేజ్ అనేది యూజర్ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోకుంటే.. అది “అన్‌సపోర్టెడ్ మెసేజ్”గా కనిపిస్తుంది.

ఈ కొత్త ఫీచర్ యూజర్లు వారి టెక్స్ట్ మెసేజ్‌లను పంపిన తర్వాత 15 నిమిషాల వరకు ఎడిట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎడిట్ చేసిన మెసేజ్‌లు చాట్ బబుల్‌లో “ఎడిటెడ్” అనే లేబుల్‌తో ప్రత్యేకంగా కనిపిస్తాయి. తద్వారా వాట్సాప్ యూజర్లు మెసేజ్ ఎడిట్ చేశారనే విషయం తెలుసుకోవచ్చు.

ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్‌ ఫీచర్ మొదట్లో టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే సపోర్ట్ చేయవచ్చు. తర్వాత ఇమేజ్‌లు, వీడియోలు, డాక్యుమెంట్‌ల క్యాప్షన్‌లను ఎడిటింగ్ చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

‘డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ తర్వాత వాట్సాప్ యూజర్లు ఎక్కువగా రిక్వెస్ట్ చేసిన ఫీచర్‌ ‘ఎడిట్‌’ ఫీచర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో లేకపోవడం వల్ల తప్పులను సరిదిద్దుకోవడానికి వారు మెసేజ్ మొత్తం డిలీట్ చేయాల్సి వస్తోంది. అంతేకాదు మళ్లీ దానిని సెండ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

దీనివల్ల మెసేజ్ పంపే యూజర్స్‌కి శ్రమ, టైమ్‌ వృథా అవుతుంది. రిసీవ్ చేసుకునేవారు కూడా గందరగోళానికి గురవుతున్నారు. కాగా కొత్త ఎడిటింగ్ ఫీచర్‌తో, వినియోగదారులు తమ సందేశాలలో అక్షరదోషాలు, తప్పులను త్వరగా, సులభంగా సరిచేయగలరు. దీంతో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.

ఈ అప్‌కమింగ్ ఎడిటింగ్ ఫీచర్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను కలిగి ఉన్న iMessage, టెలిగ్రామ్ వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లకు వాట్సాప్‌ను పోటీగా నిలబెడుతుంది. అయితే ఎడిటింగ్ ఫీచర్ స్టాండర్డ్ వెర్షన్‌కు ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలియ రాలేదు. బీటా టెస్టర్‌లు మాత్రం దీన్ని త్వరలో అందుకోవచ్చు. మొత్తంమీద, ఎడిటింగ్ ఫీచర్ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తుంది.