ఈ రోజు జరిగిన జూమ్ కాల్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో త్వరలో రాష్ట్రంలో జరుగబోయే శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నారై తెలుగుదేశం విక్టోరియా ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, ఉపాధ్యక్షులు ధరణేష్ యడ్లపల్లి, కోశాధికారి ప్రశాంత్ వీరమాచినేని మరియు పార్టీ సభ్యులు శ్రీనివాస్ చౌదరి, బసంత్ మండవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వివిధ అంశాల పైన సూచనలు ఇచ్చారు. ఎన్నారైల తరుపున తమ వంతు కృషి చేస్తాం అని చంద్రబాబుకి వారు తెలియచేసారు . ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు విజయం సాదించాలి అని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.