హైద్రాబాద్ నగరంలో తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్న వైద్యుడు (Doctor), మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడయిన డాక్టర్ మజ్హర్ అలీ ఖాన్ (Mazaruddin Aali Khan) ఉదంతంపై విదేశాలలో నివసిస్తున్న హైద్రాబాదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆస్తి వివాదాలే కారణమా?
ఒమన్ రాజు నజరనాలతో భారీ ఆస్తులు
హైద్రాబాద్ నగరంలో తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్న వైద్యుడు (Doctor), మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడయిన డాక్టర్ మజ్హర్ అలీ ఖాన్ (Mazaruddin Aali Khan) ఉదంతంపై విదేశాలలో నివసిస్తున్న హైద్రాబాదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కుటుంబ తగదాలు, ఆస్తి వివాదాలతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న మజ్హర్ అలీ ఖాన్ హైద్రాబాద్ నగరంలోని ప్రముఖుల కుటుంబానికి చెందిన వాడు. ‘సియాసత్’ దినపత్రిక జాహీద్ అలీ ఖాన్‌కు సోదరుడు.
మృతుడు మజ్హార్ అలీ ఖాన్‌కు వారసత్వంగా దక్కిన ఆస్తులకు తోడుగా అతని అత్తారింటి నుంచి కూడా భారీగా ఆస్తిపాస్తులు అందాయి. మజ్హర్ అలీ ఖాన్ మామ డాక్టర్ రషీద్ దిగవంత ఒమన్ రాజు సుల్తాన్ ఖబూస్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా పని చేశారు. ప్రపంచంలోకెల్లా సుదీర్ఘ కాలం దేశాధినేతగా 50 ఏళ్ళు సుల్తాన్‌గా ఒమాన్‌ను ఏలిన ఖబూస్‌కు అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో హైద్రాబాద్‌కు చెందిన రషీద్ ఒకరు. తాను మరణించే వరకు రాజు (సుల్తాన్)గా అర్ధ శతాబ్దికు పైగా పరిపాలించిన ఖబూస్‌కు రషీద్ వ్యక్తిగత వైద్యునిగా, ఆ తర్వాత సలహాదారుడిగా కూడా సేవలందించారు.
మజ్హర్ అలీ ఖాన్ భార్య ఆఫియా పుట్టినప్పటి నుండి 1993లో పెళ్ళి వరకు ఒమన్ రాజధాని మస్కట్‌లోనె తల్లిదండ్రుల వద్ద గడిపింది. తన సలహాదారునికి రాజు అనేక నజరానాలు బహుకరించే వాడు. డాక్టర్ రషీద్ సంతానమంతా కూడా అమెరికాలో స్థిరపడగా ఒక్క ఆఫియా మాత్రమే హైద్రాబాద్‌లో ఉంటుంది. మాతృభూమిపై మమకారం, చిన్న కూతురిపై అనురాగంతో తండ్రి ఆమెకు హైద్రాబాద్ నగరంలో అనేక ఆస్తులు బహుకరించాడు. హైద్రాబాద్ నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అనేక ఆకర్షనీయమైన ఫాం హౌసులు కూడా అల్లుడికి ఇవ్వడం జరిగింది.గత మూడేళ్ళుగా భార్యాభర్తలలో మనస్పర్ధలు ఏర్పడి ఆస్తిపాస్తుల వివాదం ఏర్పడింది. తన తండ్రి తనకు ఇచ్చిన డబ్బుతో తాను ఆస్తులు కొనుగోలు చేశానంటూ భార్య న్యాయస్ధానానికి కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో డాక్టర్ మజ్హర్ అలీ ఖాన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.