Politics

కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళతారు.

కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళతారు.

లిక్కర్ స్కాంలో అతిత్వరలోనే కవిత జైల్ కి వెళ్తుందని బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్కించుకున్నారు.‌ దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. మోదీ ఉద్యోగాలు, ఆయుష్మాన్ భారత్ అందరికీ చెందాలని ఈ బడ్జెట్ లో పెట్టారని చెప్పారు.. మోదీ ఇళ్ళు కట్టడానికి బడ్జెట్ లో మంచి ప్రొవిజన్స్ పట్టారని, పది లక్షల కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వెచించారని తెలిపారు.. హైవే,రైల్వే,ఇతర సంస్థల్లో కూడా ఎక్కువ నిధులు ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ పెట్టారని తెలిపారు.. తెలంగాణలో కేసిఆర్ పై వ్యతిరేకత డైవర్షన్ చేసేందుకు బిఆర్ఎస్ పార్టి పెట్టారని ఆయన ఆరోపించారు.. తెలంగాణలో దోచుకున్న అవినీతి సొమ్మునంతా ఇతర రాష్ట్రాల్లో‌ ఖర్చు పెడుతున్నారని, దేశంలో అన్ని కన్నా రిఛ్ పార్టి,ఎక్కువ నిధులు ఉన్న పార్టి‌ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి అయ్యే అని ఆయన విమర్శించారు.. ప్రజల సొమ్ముతో టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టి అంటూ నాలుగు వందల‌ కోట్లతో విమానం కొన్నారని, తెలంగాణ ఖజానాను దోచుకునేందుకు కేసిఆర్ జీవిస్తున్నట్లు ఆయన విమర్శించారు.. రైతులకు,ప్రజలకు ఇచ్చి‌న హామీలను కేసీఆర్ మరిచారని,మెగా కృష్ణారెడ్డి వంటి కాంట్రాక్టర్ లను ప్రపంచంలోనే ధనికుడిని చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి బిఆర్ఎస్ పార్టిలో చేరుతున్నారో వారందరికి తెలంగాణలో స్ధానం లేదని, పంజాబ్, గుజరాత్ ఎన్నికలలో నగదు అవసరం అని,కేజ్రివాల్ తో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్న కవిత, 150 కోట్ల రూపాయలు ఆఫ్ గవర్నమెంట్ కు ఇచ్చిందన్నారు.. త్వరలోనే సుసోడియా ఎలాగైతే‌ జైల్ కి వెళ్ళాడో, అతిత్వరలోనే కవిత కీడా వెళ్తుందన్నారు.. లిక్కిర్ స్కాంను ఢిల్లి, పంజాబ్ లో కూడా చేయాలనే కాకుండా దేశం అంతా చేయాలని అనుకున్నారని, కేంద్రం ఈ లిక్కర్ స్కాంలో ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్ధితులు ఉందన్నారు..

బైట్ : వివేక్ వెంకటస్వామి,బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు-*