Movies

మంచు ఇంట్లో మొదలైన మనోజ్ పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

మంచు ఇంట్లో మొదలైన మనోజ్ పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా విలన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న మోహన్ బాబు ముగ్గురు పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కుమారులు ఇద్దరు హీరోలుగా రాణించటానికి ప్రయత్నాలు చేస్తుంటే మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న కూడా ఒకవైపు నటిగా మరొకవైపు నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. కానీ మంచు మనోజ్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అయింది.

తాజాగా చాలా కాలం తర్వాత మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.మంచు మనోజ్ సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని మనోజ్ వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన రెండు సంవత్సరాలకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకొని దూరమయ్యారు. చాలాకాలంగా ఒంటరిగా ఉన్న మనోజ్ ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకుడైన భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి తో వివాహానికి సిద్ధమైనట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. మార్చి మూడవ తేదీ వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నారు.

పూజా కార్యక్రమాలతో మొదలైన మనోజ్ పెళ్లి వేడుకలు…
ఈ క్రమంలో ఇప్పటికే మంచి కుటుంబంలో వివాహ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా మంచు కుటుంబంలో మొదలైన మనోజ్ పెళ్లి వేడుకలను మహా మంత్ర పూజతో ప్రారంభించారని, ఇందుకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఈ వేడుకలలో పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ రెండవ పెళ్లికి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.