వైఎస్ కుటుంబ ఆడపడుచులు, అవినాష్ రెడ్డి కోరుకుంటున్నట్లుగా వివేక హత్య సూత్రధారులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
రాజధాని తరలింపు ప్రక్రియ అసాధ్యం…
అమరావతి రైతులకు ప్రస్తుతం మరో నెల రోజులపాటు ఊరట…
ఆ తరువాత శాశ్వతంగా వారికి ఊరటే
సునీల్ కుమార్ పై రాష్ట్ర డీజీపీ పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలి
విచారణకు సంపూర్ణంగా సహకరించేందుకు తాను సిద్ధం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీ లో మొదలుపెట్టిన సర్పయాగాన్ని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం స్ఫూర్తితో, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మద్యం కుంభకోణం పై విచారణ జరిపించాలన్నారు. అసలు రాష్ట్రంలో అసలు మద్యం కుంభకోణం అన్నదే చోటు చేసుకోలేదని తేలితే తమ పార్టీకే మంచిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మద్యం కొనుగోళ్లు, అమ్మకాలు, నగదు లావాదేవీల పై సమగ్ర విచారణ జరిపించాలని రఘురామకృష్ణం రాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఆదిశగా నూతన గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సచ్చీలతను నిరూపించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిబిఐ విచారణను కోరాలని సూచించారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఢిల్లీలో జరిగిన చిన్నపాటి మద్యం కుంభకోణానికి ఉపముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేశారని, ఇప్పటికే ఈ కుంభకోణంలో ఏడు, ఎనిమిది మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇంకా కూడా అరెస్టు జరగవచ్చునని అంటున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరబిందో ఫార్మా, కీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని తొలుత అరెస్టు చేసిన విషయాన్ని రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. చెడు సావాసాల వల్ల శరత్ చంద్రారెడ్డి
మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టారని, ఆడాన్ డిస్టలరీస్ అనే సంస్థను స్థాపించారన్నారు. రాష్ట్రంలోని డిస్టలరీస్ ను లీజు కు తీసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లభించని మద్యం బ్రాండ్లను సృష్టించి వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగినట్లుగా ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై నూతన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రానికి లేఖ రాసి, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరడం జరిగిందని వెల్లడించారు. సిబిఐ తన విచారణలో భాగంగా సౌత్ గ్రూప్ కింగ్ పిన్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తరహా అవినీతిని సహించారన్న రఘురామకృష్ణం రాజు, రాష్ట్రంలో 100 కోట్ల కుంభకోణం చేశారంటే వారు మహాత్ము లేనన్నారు. 50 వేల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే మాత్రమే నిందితులంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం విలువ ఎంత అన్నది ఎవరు అంచనా వేయలేకపోతున్నారన్నారు. ప్రతి ఏటా 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన మద్యం వ్యాపారంలో, సింహ భాగం ఆడాన్ డిస్టలరీస్ దేనన్న సత్యం, జగన్, జగమెరిగిన దేనని పేర్కొన్నారు. రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ బాధ్యతలను
కేంద్ర సర్వీసులో ఉన్న స్వజాతీయులైన కిందిస్థాయి అధికారులకు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించాల్సిన పోస్టులో, కేంద్ర సర్వీసులకు చెందిన జూనియర్ అధికారుల నియమించి, వారికి పూర్తి బాధ్యతలను అప్పగించడం వెనుకనున్న మతల భేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎండి గా నియమించిన వారికి పూర్తి బాధ్యతలను అప్పగించి, రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ పేరిట అప్పులు చేశారన్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఆడాన్ డిస్టలరీస్ నుంచి మద్యం సరుకును కొనుగోలు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో మూడు వేల పైగా మద్యం దుకాణాలు ఉంటే గత నాలుగేళ్లుగా నగదు లావాదేవీలనే నిర్వహిస్తూ, ఇప్పుడు తూతూ మంత్రంగా 11 మద్యం అవుట్లెట్లలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికీ డిజిటల్ లావాదేవీలు నిర్వహించ పోవడం వల్ల, మద్యం అమ్మకాలలో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో రామరాజ్యాన్ని అందిస్తున్న తన ప్రభుత్వంపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ముందుకు వచ్చి సిబిఐ విచారణను కోరితే మంచిదని సూచించారు. ప్రపంచ దేశాలలోని ప్రఖ్యాత బ్రాండ్లకంటే, రాష్ట్రంలో విక్రయిస్తున్న బ్రాండ్లు గొప్పవని భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఆ బ్రాండ్ల తయారీకి వినియోగిస్తున్న రా మెటీరియల్ గురించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా లభిస్తున్న ప్రముఖ మద్యం బ్రాండ్లు, రాష్ట్రంలో ఎందుకు లభించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు . దేశవ్యాప్తంగా టెండర్లలో పాల్గొన్న ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు, తమ బ్రాండ్లను అన్ని రాష్ట్రాలలో విక్రయిస్తున్నాయన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఒకటి రెండు శాతం కంటే ఎక్కువగా ప్రముఖ మద్యం బ్రాండ్లు లభించడం లేదని, అసలు వారు టెండర్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని నిలదీశారు.
గూగుల్ టెక్ అవుట్ ను తప్పు పట్టడం ఎందుకు?
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. గూగుల్ టేక్ అవుట్ పరిజ్ఞానాన్ని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, తొందరపాటు తనాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. ఎటువంటి తప్పు చేయలేదని సజ్జల విశ్వసిస్తున్నట్లుగానే, రాష్ట్రంలో కొంతమంది ప్రజలు కూడా భావిస్తున్నారని… మనము ఏ తప్పు చేయనప్పుడు కంగారుపడి ఎదురు దాడి చేస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుందన్నారు. అటువంటి అనుమానాలు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వైయస్ వివేక హత్య కేసులో సూత్రధారులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల కోరడం, వైయస్ కుటుంబ ఆడపడుచుల కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సూత్రధారులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారని ఒక మీడియా ప్రతినిధి గుర్తు చేయగా ఆయన ఆకాంక్ష కూడా నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఒక టీవీ ఛానల్ తో మాట్లాడిన వీడియోను మీడియా ముందు రామకృష్ణంరాజు ప్రదర్శించారు. తనని కడప ఎంపీ స్థానానికి పోటీ చేయమని వైయస్ వివేకానంద రెడ్డి ఒత్తిడి తెచ్చిన మాట నిజమేనని షర్మిల అంగీకరించారు. ఈ సందర్భంగా తనకు పెద్దగా ఆసక్తి లేదని చెప్పినప్పటికీ కూడా, తన చిన్నాన్న వినే పరిస్థితిలో లేరని, పోటీ చేయాలని పట్టుబట్టారన్నారు. 1999 లోనే వైయస్ వివేకానంద రెడ్డి స్థానంలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని భావించినట్లు డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని రఘు రామకృష్ణంరాజు తెలిపారు . 2004లోనూ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం తన సోదరుడు అభ్యర్థిత్వం పట్లనే మొగ్గు చూపారని, ఆయన చేత నామినేషన్ వేయించాల్సింది గా సూచించారని డీఎల్ వివరించారన్నారు . ఎంపీగా ఎన్నికైన వివేకపై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన తన పదవికి రాజీనామా సైతం చేయగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించలేదని చెప్పారని పేర్కొన్నారు .
సిబిఐ కౌంటర్ పిటిషన్ ద్వారా వెలుగు చూసిన వాస్తవాలు
సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కు కౌంటర్ గా సిబిఐ దాఖలు చేసిన అభ్యంతర పిటిషన్ ద్వారా అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. సునీల్ యాదవ్ కు ఎట్టి పరిస్థితిలోనూ బెయిల్ లభించే అవకాశాలు లేవన్నారు. సజ్జల మీడియాతో మాట్లాడిన తర్వాత ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. వైయస్ వివేక హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చెప్పడం పరిశీలిస్తే ఒకేసారి తమ పార్టీకి ఇన్ని కష్టాలు రాబోతున్నాయా అనే సందేహం, సందిగ్ధత కలుగుతోందని చెప్పారు . ఈనెల 23వ తేదీ విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు కోరగా, తాను బిజీ గా ఉన్నానని చెప్పిన వైయస్ భాస్కర్ రెడ్డి, 25 వ తేదీన సీబీఐ అధికారులు పిలవకుండానే హాజరు కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 25వ తేదీన భాస్కర్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలిచినట్లుగా నీలి మీడియా చానళ్లు కూలి వార్తలు రాశాయని ఎద్దేవా చేశారు. తాను సిబిఐ కి సంపూర్ణ సహకారం సహకారం అందిస్తున్నట్లుగా భాస్కర్ రెడ్డి తన పాత్రను అద్భుతంగా పండించారని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ ఎక్కడికైనా మకాం మార్చవచ్చు… కానీ ఆ పట్టణం రాజధాని కాదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకిష్టమైన పట్టణానికి మకాం మార్చుకోవచ్చునని , అంతమాత్రాన అది రాజధాని నగరం అంటే కుదరదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. రాజధాని తరలింపు అనేది కలలో కూడా జరగని మాట అని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం పై మాత్రమే గతంలో స్టే ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే కట్టడాలపై ఎటువంటి స్టే ఇవ్వక పోయిన ప్రభుత్వ పెద్దలు నెగిటివ్ మైండ్ సెట్ తో నిర్మాణాలను పూర్తిగా ఆపివేశారన్నారు. రాజధాని నిర్మాణం పై స్టే ఉండడం వల్ల, కోర్టు ధిక్కరణ కిందికి రాదన్న ఉద్దేశం నిర్మాణ పనులు ఆపివేసి ఉంటారని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంటులో చట్టం చేసి ఉండడంవల్ల, ఆ చట్టాన్ని 175 కు 175 స్థానాల్లో గెలిచిన, 175 కు 250 స్థానాలను దక్కించుకున్న రాష్ట్ర అసెంబ్లీలో సవరణ చేయడం కుదరదని స్పష్టం చేశారు. రాజధాని మార్పుపై తమకు అధికారం లేదంటా అని సుప్రీంకోర్టులో వాపోయినప్పటికీ, స్టే మాత్రం ఇవ్వలేదని గుర్తు చేశారు. రాజధాని తరలింపు పై ఎవరి నోటికొచ్చినట్లు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, ఇంతటి అజ్ఞానులనా మనము ఎన్నుకున్నదని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. రాజ్యాంగ ఓనమాలు కూడా తెలియని సన్నాసులనా ఎన్నుకున్నదని బాధపడుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రలో తమ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, మంత్రులకు కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. విశాఖలో ఆస్తులను కొనుగోలు చేసి, ఋషికొండకు గుండు కొట్టి భారీ భవంతులను నిర్మించినా ఈ ముఖ్యమంత్రి తన పదవీకాలంలో రాజధానిని తరలించలేరన్నది అక్షర సత్యం అని పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉంటానని, విశాఖకు అధికారులంతా వచ్చి వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తే ప్రజాధనం దుర్వినియోగం పై ఆందోళనలు తలెత్తే అవకాశం లేకపోలేదని రఘు రామకృష్ణంరాజు అన్నారు. రాజధాని అంశంపై అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, మార్చి 28వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ నెల రోజులపాటు అమరావతి రైతులకు ఊరటే నని, ఆ తర్వాత కూడా వారికి పూర్తిస్థాయి ఊరట లభిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
రాష్ట్రానికి త్వరలో మంచి రోజులు రావాలి
కాశీ విశ్వనాధుని దర్శించుకున్న తాను రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. కాశీ కారిడార్ అనతి కాలంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతంగా
తీర్చిదిద్దారని కొనియాడారు. ఏపీ సి ఐ డి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ఏమి చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
ఆదేశించిందని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి వివరిస్తూ లేఖ రాశారు అన్నారు. గతంలో తాను అనేకమార్లు సునీల్ కుమార్ అవినీతి, అక్రమాలపై డిఓపిటి కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాయడం జరిగిందని తెలిపారు. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సునీల్ కుమార్ ఏ విధంగా అక్రమ మార్గంలో నిధులు సేకరిస్తున్నారో సవివరంగా వివరించానని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, డి ఓ పి టి కార్యదర్శి లేఖలు రాశాననే అక్కసు తో సునీల్ కుమార్, ఢిల్లీలో కూర్చుని నాలుగు మంచి మాటలు చెబితే భరించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లు తనపై కక్ష పెంచుకొని తప్పుడు కేసులు బనాయించి, అరెస్ట్ చేసి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారన్నారు. తాను ఢిల్లీలో కూర్చుని నాలుగు మంచి మాటలు చెబితే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నానని తనపై రాజ ద్రోహం కేసును నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాతే వై నాట్ 175 అని అన్నారని, అటువంటప్పుడు తాను ఎలా ప్రభుత్వాన్ని కూల్చగలనని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఫిర్యాదులను పెడచెవిన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, న్యాయవాది లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపైనైనా స్పందించడం అభినందనీయమన్నారు. తాను ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకోవడం నామోషీగా భావించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు జరిపించి సునీల్ కుమార్ పై అవినీతి అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి తాను ఇచ్చిన ఫిర్యాదు కాపీలతో రాష్ట్ర డిజిపి కి ఒక లేఖ రాయనున్నట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. డీజీపీ హోదా కలిగిన సునీల్ కుమార్ పై విచారణను రాష్ట్ర డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతోందని భావిస్తున్నానని, విచారణ అధికారిని తన వద్దకు పంపిస్తే పూర్తి వివరాలను అందజేసి సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. లాకప్ లో తనని చిత్రహింసలకు గురి చేసిన వారిలో ఎవరి పాత్ర ఏమిటో విచారణ అధికారికి వివరిస్తారని, విజయ్ పాల్ తో సహా ఇతరుల పాత్ర ఏమిటో చెబుతానని అన్నారు. ప్రభుత్వం తనపై కక్ష కట్టి రాష్ట్రానికి రానిచ్చే పరిస్థితి లేనందున, ఢిల్లీకి విచారణా ధికారిణి ని పంపించాలని కోరనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు . ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, గూగుల్ టేక్ అవుట్ లను వినియోగించుకొని సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్ఫూర్తితో బరితెగించిన ఓ ఐపీఎస్ అధికారి, పోలీసుల్లోనే అత్యంత దుర్మార్గుడైన సునీల్ కుమార్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు . పోలీసుల్లో మీసాలు తిప్పి గుడ్డలు విప్పిన వారిని చూశామన్న ఆయన, అత్యంత దుర్మార్గుడైన సునీల్ కుమార్ పై ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలన్నారు. తనని సంప్రదించకుండానే రాష్ట్ర పోలీసులు నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేస్తే అది పనికిరానిదేనని పేర్కొన్నారు. కస్టోడియల్ టార్చర్ తాను వేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానుంది అని తెలిపారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని