శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం
భక్తులు ఒకటి కంటే ఎక్కువ టోకెన్లు తీసుకోకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ తిరుపతి దేవస్థానం మార్చి 1 నుండి భక్తుల కోసం ముఖ గుర్తింపు విధానాన్ని (Facial Recognition System) ప్రవేశపెట్టనుంది. ఆలయాన్ని నిర్వహించే ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), మరింత ప్రభావవంతంగా భక్తులకు సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెబ్సైట్లో పోస్ట్ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. మార్చి 1 నుంచి వైకుంఠం 2, ఏఎంఎస్ సిస్టమ్స్ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్దమైంది.