సింగపూర్ శివుడు..!!
🌸సింగపూర్ గేలాంగ్ తూర్పునలో నిర్మించబడిన శ్రీ విశాలాక్షి సమేత
శ్రీ విశ్వనాధుని ఆలయం చాలా ప్రసిద్ధి పొందినది.
🌸ఈ ఆలయం సుమారు
రెండు వందల సంవత్సరాల కి ముందే
నిర్మించబడినది. సింగపూర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధర్మకర్తల నిర్వహణలో
యీ ఆలయం నడుస్తున్నది.
మనదేశంలో పరమేశ్వరునికి జరిగే ఉత్సవాలు , సేవలు అన్నీ యీ
ఆలయంలో జరుగుతాయి.
ఎక్కువ గా ఉత్తర భారతదేశం నుండి , తమిళనాడు నుండి భక్తులు అధిక సంఖ్యలో యీ శివాలయ దర్శనం
చేసి తరిస్తూ వుంటారు.
🌸గర్భగుడి ముందు లోపలి
పై కప్పు మీద శివుని యొక్క అరువది నాలుగు మూర్తులు మలచి వుంటాయి. కింద భాగమున వున్న గోడలమీద నూట ఎనిమిది శివతాండవ భంగిమలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసి అమర్చి వుంటాయి.
🪷వినాయకుడు, కుమారస్వామి, గురుభగవానుడు ప్రత్యేక
సన్నిధుల నుండి దర్శనము యిస్తూ వుంటారు. బయట ఆవరణలో నటరాజస్వామి కి ప్రత్యేక సన్నిధి వున్నది.
🌸అదే ఆవరణలో దోషాలు తొలగించే నవగ్రహాల కి సన్నిధి వున్నది. ఆలయ ముఖద్వారం వద్ద ఎడమ ప్రక్కన, నర్మదా నది నుండి తీసుకుని వచ్చిన పునీతమైన రాతి శివలింగం ప్రతిష్టించ బడినది.
🪷దీనినే “ఆత్మలింగేశ్వరుడని” అంటారు. యీ లింగానికి ఎవరికి వారే స్వయంగా జల, పాలభిషేకములు
చేయ వచ్చును. భారతీయుల కోరిక మేరకు యీ ఆలయం
నిర్మించబడి నట్లు చెప్తారు.
🌸ఆలయ విమానములు
ఉత్తర దేశ బాణీలో నిర్మించ బడ్డాయి.
ఉత్తర భారత దేశ బాణీలో నిర్మాణం
జరిగినా,దక్షిణ భారత దేశ శివాగమశాస్త్ర విధానాలతో,పూజలు జరుగుతాయి.
🪷ఆలయ గోపుర విమానాలు , తంజావూరు బృహదీశ్వరాలయ విమానంలాగ, కంచి ఏకాంబరేశ్వరుని ఆలయ విమానం వలనే రాజగోపురం కంటే చాలా ఎత్తు కలిగి వుంటాయి.
🌸బయో లేబర్ అనే ‘మెట్రో’ స్టేషన్ కి సమీపంలో యీ శివాలయం వున్నది.
ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, మూలమంత్ర
జపాలు,చాలా ఘనంగా, వైభవంగా జరుపుతారు. అలాగే యీ ఆలయంలో
మరో ప్రక్కన పితృతర్పణాలు, శ్రాధ్ధకర్మలు కూడా నిర్వహిస్తారు.