Business

వరుసగా ఎనిమిదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

వరుసగా ఎనిమిదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

ఒత్తిడికి గురైన మెటల్ షేర్లు
326 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
88 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల బాట పట్టాయి. జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మెటల్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 58,962కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17,303 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.03%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.87%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.67%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.03%), రిలయన్స్ (-1.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.77%), ఇన్ఫోసిస్ (-1.46%), ఐటీసీ (-1.40%).