Politics

సమస్యలు పరిష్కరిస్తారా? సమ్మెలోకి వెళ్ళమంటారా…

సమస్యలు పరిష్కరిస్తారా? సమ్మెలోకి వెళ్ళమంటారా…

ఏపిజెఏసి అమరావతిఃవిజయవాడ:తేదిః28-02-23

పత్రికాప్రకటన

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేసిన AP JAC అమరావతి.

ఆంధ్రప్రధేశ్ ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక,రిటైర్డు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గత ఏడాది పిభ్రవరినెలలో 11 వ పిఆర్శీ పై ఉద్యమం జరిగిన సందర్బంగా ముఖ్యమంత్రిగారు,మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలుచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాదోరణి అవలంబిస్తున్నందున మార్చి 9 నుండి ఏప్రీల్ 3 వరకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ నోటీసును మంగళవారం సచివాలయంలో గౌ|| చీఫ్ సెక్రటరీ డా|| కె.యస్.జవర్ రెడ్డి, ఐఏఎస్ గారికి ఏపిజెఏసి అమరవాతి రాష్ట్ర కమిటి తరుపున అందజేసారు.

ఈసందర్బంగా గౌ||సిఎస్ గారితో జెఏసి నేతలు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు, టి.వి.ఫణిపేర్రాజు, వి.వి.మురళి కృష్ట నాయుడు తదితరులు మాట్లాడుతూ… స్వయానా ఉద్యోగసంఘ నాయకులకు గౌ|| ముఖ్యమంత్రీగారే ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్దంకాని పరిస్దితి ఒకవైపు, మరోకవైపు అసలు ఉద్యోగుల జీతభత్యాలకు కేటాయించిన బడ్జెట్, ఎమౌతుందో తెలియడంలేదు. ఇతర బకాయిలు చెల్లించేందుకు కేటాయించిన మా బడ్జెట్ ఏమౌతుంది?
అసలు మా డబ్బులు ఎవరికి మళ్లీస్తున్నారు, మాకు పనిచేసినకాలానికి 1 జీతాలు ఎందుకు ఇవ్వరు? మేము దాచుకున్ణ డబ్బులు తిరిగి మా అవసరాలకు ఎందుకు ఇవ్వరు? మాకు రావల్సిన అరియర్సు/డిఏ బకాయిలు, కొత్త డిఏ , లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు ఇలాంటి ఆర్దికపరమైన అంశాలు అన్నింటీపైన స్పష్టమైన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని లేదంటే మాత్రం మార్చి 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదనీ, ఈ ఉద్యమం వలన ప్రజలకు ఎటువంటీ అసౌకర్యాలు కలిగినా సరే దాని ఉద్యోగులుగా మేము బాద్యులుంకాదని, దీనికి ప్రభుత్వమే భాధ్యత వహించాలని, దీనికి ఉద్యోగులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమౌతుందని ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు సియస్ కి స్పస్టంచేసారు.

ఏపి జెఏసి అమరారతి రాష్ట్రకమిటి ప్రకటించిన ఉద్యమషెడ్యూల్

> మార్చి 1 నుండి ఉద్యమానికి కలసి వచ్చే ఉద్యోసంఘాల/ట్రేడ్ యూనిన్లు/ప్రజాసంఘాల మద్దతు కోరేకార్యక్రమాలు ప్రారంబం.

>మార్చి రెండు నుండి 5 వరకు 26 జిల్లాలలో ఉద్యమానికి ఉద్యోగులను సిద్దం చేసేందుకు అన్నిసంఘాలతో విస్ట్రుతస్దాయి సమావేశాలు నిర్వహిస్తాం.

>మార్చి 9,10 తేదీలలో నల్ల బ్యాడ్జ్ లతో విధులకు హాజరు.

>మార్చి 13,14,భోజన విరామ సమయంలో ఆందోళన.

>మార్చి 15/17/20 తేదీలలో అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలవద్ద ధర్నాలు.

> మార్చి 21 న ఒక్క రోజు సెల్ డౌన్.

> మార్చి 21 నుండి వర్క్కుటూ రూల్ ప్రారంభం

>మార్చి 24 న అన్ని హెడ్ ఆఫీస్ ల వద్ద ధర్నాలు.

>మార్చి 27న కరోనా తో‌ చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులు పరామర్శ

>ఏప్రిల్ ఒకటిన సిపియస్ ఉద్యోగులు కుటుంబాల పరామర్శ

>ఏప్రిల్ 3 న ఛలో కలక్టరేట్ కార్యక్రమం ద్వారా స్పందన లో ఉద్యోగుల సమస్యతో రిప్రజెంటేషన్ ఇస్తాం.

ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. రెండో ఫేజ్ భవిష్యత్ కార్యాచరణ,కీలకనిర్ణయాలు ప్రకటన చేస్తాం.

ధన్యవాదాలతో…
బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు