Movies

రామ‌కృష్ణ‌, హరికృష్ణ నుండి తార‌క‌ర‌త్న వ‌ర‌కూ…మ‌ర‌ణించిన ఎన్టీఆర్ వార‌సులు వీరే..!

రామ‌కృష్ణ‌, హరికృష్ణ నుండి తార‌క‌ర‌త్న వ‌ర‌కూ…మ‌ర‌ణించిన ఎన్టీఆర్ వార‌సులు వీరే..!

నంద‌మూరి ఫ్యామిలిలో వ‌రుస విషాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఎన్టీఆర్ వార‌సులు దూరం అవుతుండం అభిమానుల‌ను ప్రేక్ష‌కుల‌ను బాధిస్తోంది. రీసెంట్ గా ఎంతో భ‌విష్య‌త్ ఉన్న నంద‌మూరి తార‌క‌ర‌త్న గుండె పోటుతో మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. న‌ల‌భై ఏళ్ల వ‌య‌సులోనే తార‌క‌ర‌త్న క‌న్నుమూయ‌డం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్టీఆర్ వార‌సులు ఎంత‌మంది మ‌ర‌ణించారో ఇప్పుడు చూద్దాం….ఎన్టీఆర్ పెద్ద‌కుమారుడు రామ‌కృష్ణ చిన్న వ‌య‌సులోనే అనారోగ్యంతో క‌న్న‌మూశాడు.

రామ‌కృష్ణ ఎంతో చురుకుగా ఉంటూ తండ్రికి సాయ‌ప‌డేవార‌ట. కానీ ఆయ‌న చిన్న‌వ‌య‌సులోనే క‌న్నుమూయ‌డంతో కుటుంబంలో విషాదం నిండుకుంది. ఇక ఎన్టీఆర్ మ‌రోకుమారుడు సాయి కృష్ణ 2004లో క‌న్నుమూశాడు. కాగా సాయికృష్ణ సినిమాల్లోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. అంతే కాకుండా ఎన్టీఆర్ మ‌రో కుమారుడు హ‌రికృష్ణ కార్ యాక్సిడెంట్ లో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

హ‌రికృష్ణ హీరోగా మ‌రియు రాజ‌కీయాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అభిమానుల‌తో టైగ‌ర్ అని పిలిపించుకున్నాడు. కాగా హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించడం కుటుంబ సభ్యులు, అభిమానులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంతేకాకుండా హ‌రికృష్ణ కుమారుడు జ‌య‌కృష్ణ సైతం రోడ్డు ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించ‌డం బాధాక‌రం. మ‌రోవైపు ఎన్టీఆర్ కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి 2022లో క‌న్నుమూశారు. ఉమామ‌హేశ్వ‌రి త‌న నివాసంలో ఆత్మ‌హ‌* చేసుకోవ‌డం అంద‌ర్నీ షాక్ కు గురిచేసింది.