NRI-NRT

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోMS కంప్యూటర్ కోర్సులు ప్రారంభం..

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోMS కంప్యూటర్ కోర్సులు ప్రారంభం..

అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండిMS కంప్యూటర్ సైన్స్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు సిలికానాంధ్ర చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ తెలిపారు.

ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో MS కంప్యూటర్ సైన్స్ అభ్యసించాలనుకునే విద్యార్థులకు I-20 మంజూరు (F Student Visas) చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుంచి అనుమతి లభించిందని తెలియజేయడానికి మాకెంతో ఆనందంగా ఉంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రగతిలో ఇదొక గొప్ప మైలురాయి. మరెన్నో కోర్సులను ప్రవేశపెట్టే దిశగా విశ్వవిద్యాలయ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటిలానే మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులను కోరుకుంటూ ఈ విజయానికి తోడ్పడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.