Devotional

నాగ సాధువుల జీవన విధానం ఎలా ఉంటుంది..

నాగ సాధువుల జీవన విధానం ఎలా ఉంటుంది..

నాగ సాధువు

ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసివస్తుంది.
అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు.
వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.

ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియచెయ్యాలి.
వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే రాంరాం చెప్పేస్తారు
ఒక సారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు.
వీరికి అక్కడ 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు శిక్షణ ఉంటుంది.
ఆ సమయం లో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుoది. ఇంకా
యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో విటీతోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు.
కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరాలు వేరు నాగ సాధువులు వేరు
నాగ సాధువులు శాకాహారులు
వీరు నేల పైనే నిద్రించాలి
రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి.

వీరు భిక్షాటన ద్వారా తమ అహరాన్నివారే సంపాదించుకోవాలి
అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన మహా ప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఎవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిదే
వీరు దిగంబరంగ జీవించాల్సి ఉంటుంది.

శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు.
వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి
మొదటిగా శివుని , శక్తిని వినాయకుని ,విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.

ఆగడాలకు వచ్చిన వారికి అంచె అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది.
ముందుగా వీరు అవధూతగా మారాలి.
గుండు చేయించుకొని వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి.
పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి ఆఫీషియల్ నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుంది.
ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతువస్తుంది.

మొదటగా (1) నాగ సాధువు
(2) మహంత
(3) శ్రీ మహంత (4) జమతియా మహంత
(5) పీఠ మహంతి
(6) దిగంబర శ్రీ
(7) మహా మండలేశ్వరుడి (8) ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును.

చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు
వీరు హిందు పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటనికైనా సిద్ధంగా ఉంటారు.
ఈక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారీనా వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది.

వీరు ఏంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు.
వీరు మనుష్యలకు కనిపించేందుకు ఇష్టపడరు.
హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివశిస్తుంటారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలల సంచరిస్తుంటారు
ధర్మ పరిరక్షణ గాడి పడిన రోజున కాల రుద్రులుగా మారుతుంటారు.
శిక్షణ లో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాలలో ఉన్న ఆగడాలలో కొన్ని అనుమతులు ద్వారా దర్శించవచ్చును.
అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం.
“ఇకపోతే నాగసాధువులు లక్షల్లో కుంభ మేళానికి వస్తారు వీరు వచ్చేసమయాలో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు, ఎక్కడ హోటల్ లో ఆహారం తీసుకున్న దాఖలు ఉండవు, వీరు కేవలం సూక్ష్మ రూపం లో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షలో వచ్చి కొద్దీ దూరం వెళ్ళాక ఎవరికి కనిపించరు…