Politics

ఎదురు ప్రశ్నిస్తే. వైకాపా వాడైన జైలుకే..ఒంగోలులో సుబ్బారావు గుప్తా అరెస్టు

ఎదురు ప్రశ్నిస్తే. వైకాపా వాడైన  జైలుకే..ఒంగోలులో సుబ్బారావు గుప్తా అరెస్టు

వైకాపా అసమ్మతి నేత సుబ్బారావు గుప్తా అరెస్టు

ఒంగోలులో గంజాయితో చిక్కినట్లు పోలీసులు వెల్లడి

ఒంగోలుకు చెందిన వైకాపా అసమ్మతి నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను గంజాయి కేసులో పోలీసులు. అరెస్టు చేశారు. డీఎస్సీ యు. నాగరాజు తెలిపిన వివ రాల ప్రకారం… ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీ వద్ద తాలూకా సీఐ వి. శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తు న్నారు. ఆ సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న సుబ్బారావు గుప్తా వారిని చూసి పారిపో యేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో సుమారు కిలో గంజాయి లభ్యమైందని, ఆయనపై కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు డీఎస్సీ వివరించారు. అన్ని కోణా ల్లోనూ దర్యాప్తు చేస్తామన్నారు. కాగా ఏడాదికాలంగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తన యుడు ప్రణీత్ రెడ్డిపై సుబ్బారావు గుప్తా తీవ్ర ఆరో పణలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఒంగోలు ఐశ్వర్యన గర్ లో మహిళా వసతిగృహంపై బాలినేని అనుచ రుడు సుభాని తన ముఠాతో దాడి చేశాడు. దీనిని బండిస్తూ సుబ్బారావు గుప్తా.. బాలినేనిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడారు. ఇది జరిగిన రెండురోజుల్లోనే ఆయన గంజాయితో పోలీసులకు చిక్కడం కలకలం సృష్టించింది. దీని వెనుక కుట్ర కోణం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది..