Movies

ఒక్కటవనున్న మనోజ్‌, మౌనిక..

ఒక్కటవనున్న మనోజ్‌, మౌనిక..

మోహన్‌బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్‌ తన జీవితంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డిని మనోజ్‌ పెళ్లాడబోతున్నారు. ఈ నెల 3న వీరి వివాహం జరగనుంది. మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి ఇంట పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం మెహందీ వేడుకతో పెళ్లి సందడి మొదలైంది. గురువారం సంగీత్‌ వేడుక నిర్వహించనున్నారు.