చురుగ్గా ఏర్పాట్లు ముమ్మర ప్రచారం
ఎన్.టి.ఆర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాల స్వామి ఆలయ 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు 5 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. నెమలి కృష్ణుడిని తమ ఇలవేల్పుగా భావించే ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది భక్తులు ఆరు రోజుల జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఈ నేప థ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నల్లనయ్య కళ్యాణ వేడుకలకు ప్రముఖులు, భక్తులను ఆహ్వానించడంలో పాలకవర్గ అధ్యక్షురాలు కె. శశిరేఖ, సహాయ కమిషనర్ డి. శ్రీరామవరప్రసాదరావు, సభ్యులు నిమ గ్నమయ్యారు.
వైభవంగా తిరు కల్యాణోత్సవం:
ఏటా ఫాల్గుణ శుద్ద పౌర్ణమి రోజు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన నెమలి కృష్ణుని తిరు కల్యాణం నిర్వహిస్తారు. ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరిం చారు. 5న వేణుగోపాలుడిని పెండ్లి కుమారుడిగా ముస్తాయి చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 6న సాయంత్రం శేష వాహన మహోత్సవం, రాత్రి ఎదురుకోల ఉత్సవం, 7న రాత్రి 10 గంటలకు దుర్భిణి, సత్యభామ సమేత వేణుగోపాల తిరుక బ్యాణ వేడుక నయన మనోహరంగా జరు గుతుంది. 8న రథోత్సవం, 8న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పల్లకి ఉత్సవం, రాత్రి తెప్పోత్సవం, 10న ద్వాదశ ప్రదక్షి ఇలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఆలయ ప్రధానార్చకులు తిరు నమరి గోపాలా చార్యుల ఆధ్వర్యంలో రుత్విక బృందం బ్రహ్సోత్యవాలను శాస్త్రో క్తంగా నిర్వహించనుంది.
స్వయంభూగా
1953 మార్చి 23న (శ్రీరామనవమి నాడు) వేణుగో పాల స్వామి నెమలిలో స్వయంభూగా వెలిశారు. గ్రామ స్టుడు వనమా సీతారామయ్య తన పొలానికి అవసర మైన సారవంత మట్టి కోసం దారా నర్సయ్య అనే వ్యక్తికి చెందిన భూమి కొనుగోలు చేశారు. అందులో తన వద్ద పనిచేసే కదారు వెంకటేశ్వర్లుతో మట్టిని తవ్వి స్తుండగా స్వామి విగ్రహం బయటపడింది. గడ్డపారు తగిలి స్వామి చిటికెన వేలు విరిగిపోగా దాన్ని వెండితో సరిచేశారు. భూమిలో లభించిన నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో 1857 ఫిబ్రవరి 6న (రథో త్వవం నాడు) శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. 1958 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.