Movies

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అరెస్ట్..!

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అరెస్ట్..!

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అరెస్ట్ అవుతారా అంటే, అవుతారనే అనిపిస్తుంది. ఇదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ లా మారింది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఏమి నేరం చేశారు ఎందుకు అరెస్ట్ అవుతారని షారుక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షారుక్ ఖాన్ ఇంట్లో ఇలాంటి సమస్య ఏమిటని ఒక పజిల్ లా ఉంది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై 409 ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ,ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ ఖాన్ పై ఇలాంటి కేసు నమోదు కావడం నిజంగా బాధాకరం. ఇంతకీ అసలు గౌరీ ఖాన్ పై ఎందుకు కేసు పెట్టారు, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.

సాధారణంగా వ్యాపారస్తులు వాళ్ళ వస్తువులను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి అనేక మార్గాలు వెతుక్కుంటారు. పామ్ప్లెట్స్, పేపర్ యాడ్, టీవీ యాడ్, సోషల్ మీడియా యాడ్, ఈవెంట్స్ ఇలా ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో సెలెబ్రేటిస్ తో ఆ వస్తువు గురించి యాడ్ ఇవ్వడం అనేది ఒక దారి. దాని నిమిత్తం ఆ సెలెబ్రేటిస్ కి కొంత డబ్బును రెమ్యూనిరేషన్ గా కొందరు ఇస్తే, బాగా మంచి సెలెబ్రెటీ కి ఆ ప్రోడక్ట్ సేల్ బిజినెస్ లో కొంత భాగస్వామ్యం కూడా ఇస్తారు. ఇది చాలా సామాన్యంగా జరిగే ప్రక్రియ. అయితే ఒకొక్కసారి ఎప్పుడు జరిగే పనుల్లోనే అనుకోకుండా కొన్ని తప్పులు జరగడం వలన చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తాది.

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ( Shahrukh khan wife Gauri khan will be arrest )కూడా పాపం అలానే ఇరుక్కుంది. ఈమెను చూసి నేనొక ఇల్లు కొన్నాను. ఆ కంపెనీ వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని, ఇల్లు ఇవ్వడం లేదు, డబ్బు కూడా ఇవ్వడం లేదని కేసు పెట్టాడు. సెక్షన్ 409 ఉల్లంఘన కేసు కింద గౌరీపై ముంబైకి చెందిన ఒక ప్రెసిడెంట్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. లక్నోలో ఒక అపార్ట్మెంట్ల కంపెనీకి గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సెలబ్రెటీస్ ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా దేనికి ఉన్నా, కస్టమర్లు ఆ ప్రోడక్ట్ ని, ప్రాజెక్ట్ ని నమ్ముతారు. ఇంత పెద్దవాళ్ళు దీనికి అంబాసిడర్ గా ఉన్నారంటే ఇందులో మనం డబ్బుని ఇన్వెస్ట్ చెయ్యచ్చు అని అనుకుంటారు.

జస్వంత్ షా అనే రెసిడెంట్ గౌరీ ఖాన్ ని చూసే, ఈ కంపెనీలో ఫ్లాట్ కోసం 86 లక్షల రూపాయలు చెల్లించానని, కానీ ఇంతవరకు వాళ్ళు నాకు ఫ్లాట్ ఇవ్వకపోగా డబ్బుకి కూడా గ్యారంటీ లేదని పిర్యాదు చేశారు. తాను డబ్బు కట్టిన ఫ్లాట్ తనకి ఇవ్వకపోగా, వేరే వారికి ఆ ఫ్లాట్ అమ్మేశారని చెప్పారు. ఆ కంపెనీ తనని చీట్ చెయ్యడం వలనే తాను చట్టపరమైన చర్య తీసుకొమ్మని, పోలీసులను ఆశ్రయించానని చెప్పారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలో ఉన్న తులసియాని గోల్ఫ్ వ్యూ లో ఫ్లాట్ అని వివరాలు ఇచ్చారు. తులసియాని కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియాని పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి గౌరీ ఖాన్ ని కూడా అరెస్ట్ చేస్తారో, ఆమె ఏమైనా చెప్పుకోగలరో చూడాలి.