తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. జనవరి 28న గుండెపోటుతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చేరిన ఆయన నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు..
ఆయన పార్థివదేహాన్ని విజయవాడ రమేశ్ ఆసుపత్రి నుంచి మచిలీపట్నంలోని స్వగృహానికి తరలించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు పీఏసీఎస్ అధ్యక్షుడిగా, 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మార్చి 29తో బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది..