తానా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి..TNI ప్రత్యేకం..
ఒకపక్క కోర్టు తీర్పులు, మరొక పక్క రాజీ ప్రయత్నాలు, ఇంకొకపక్క ఇప్పటికే ఇరువర్గాలు పోటా పోటీగా వేసిన నామినేషన్లు, ఈ నేపథ్యంలో జరగబోయే తానా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.తానా ఎన్నికల నిర్వహణ రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోయే తానా బోర్డు సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకం కాబోతున్నాయి. తమకు స్పష్టమైన ఓటర్ల జాబితాను ఇవ్వాలని ఎన్నికల అధికారి అయినంపూడి కనకం బాబు బోర్డుకు లేఖ రాశారు. దీనికి రేపు జరిగే బోర్డు సమావేశంలో సమాధానం పంపిస్తారని సమాచారం.
మరొకపక్క రాజీ ప్రయత్నాలు
ఉభయ వర్గాల వారు పోటాపోటీగా నామినేషన్లు వేసినప్పటికీ మరొకపక్క కొందరు పెద్దలు రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికలు జరిగితే తానా భవిష్యత్తుపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పోటీ తీవ్రంగా జరుగుతుందని దీని మూలంగా నేతల మధ్య సభ్యుల మధ్య ఇప్పటకే ఉన్న వర్గ వైశ్యామ్యాలు పెరిగి పెద్దమవుతాయని తానా పెద్దలు భావిస్తున్నారు.తానా ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉన్నందున పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఉభయ వర్గాల్లోనూ చాలామంది రాజీ జరిగితేనే బాగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయ? ఎన్నికలు జరుగుతాయా? అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కిలారు ముద్దుకృష్ణ.
సీనియర్ జర్నలిస్ట్.