దురుసుగా ప్రవర్తించిన వైకాపా నేతపై చేయిచేసుకున్న ఎస్సై
ఎస్సైతో క్షమాపణలు చెప్పించిన నేతలు
పల్నాడు జిల్లాలోని ఒక మండల పోలీసు అధికారి… వైకాపా నేతకు క్షమా పణలు చెప్పడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణానది తీరం వెంట ఉన్న ఒక మండలంలోని గ్రామంలో మండపం దారి విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై స్థానిక వైకాపా నేతలు, గ్రామ స్థులకు మధ్య వాదనలు జరిగాయి. సమాచారం అందడంతో ఎస్సై ఆ గ్రామానికి వెళ్లారు. రెండు వర్గాలతో మాట్లాడుతుండగా… వైకాపా నేత ఒకరు ఎన్సైతో దురుసుగా ప్రవర్తించారు. కోపో ద్రిక్తుడైన ఎస్సై ఆ నేత చెంప చెల్లుమనిపించారు. అనంతరం అందరి ముందు అవమానానికి గురైన ఆ నేత.. తమ పార్టీకి చెందిన మండల నేతలను ఒక ప్రభుత్వ కార్యాలయంలో సమావేశపరిచారు. అక్కడకు ఎస్సైని పిలిపించి మాట్లాడారు. చివరకు ఆ ఎస్సై సదరు నేతకు క్షమాపణలు చెప్పారు.