Politics

ఏపీ మంత్రికి అరెస్టు వారెంట్

ఏపీ మంత్రికి అరెస్టు వారెంట్

అమర్‎నాథ్‎కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..

విశాఖ: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్‎ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

రైల్వే స్టేషన్‎లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట అమర్‎నాథ్ పై కేసు నమోదైంది.

2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‎లోకి అనధికార ప్రవేశం చేశారు.

విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు.

దీంతో గుడివాడ అమర్‎ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నటు రైల్వే అధికారులు గుర్తించారు.

విచారణ‎లో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు అవ్వాలి.

. గుడివాడ అమర్‎నాథ్, జాన్ వెస్లీలు కోర్ట్‎కి హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ కేసును మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది