Devotional

నేటి నుంచి నెమలిలో 66వ వార్షిక బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి నెమలిలో 66వ వార్షిక బ్రహ్మోత్సవాలు

గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి 66వ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా జరగనున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు పాల్గొంటారని చైర్మన్ కావూరి శశిరేఖ తెలిపారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరక్కుండా చూడాలని ఆలయ సిబ్బందికి ఆమె సూచనలు చేశారు. వేణుగోపాల స్వామి కళ్యాణానికి 7న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆమె తెలిపారు.