స్కిన్ క్యాన్సర్‌కు బైడెన్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఛాతిలో ఉన్న కణతిని తొలగించారు. శ్వేతసౌధం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు స్కిన్ క్యాన్సర్(Skin Cancer) చికిత్స జరిగింది. ఆయన చర్మంపై ఉన్న గాయాల్ని తొలగించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్(White House) పేర్కొన్నది. క్యాన్సర్ కణాలను బైడెన్ శరీరం మీద నుంచి తొలగించినట్లు చెప్పారు. ఇక ఆయనకు అదనపు ట్రీట్మెంట్ అవసరం లేదని బైడెన్ డాక్టర్ తెలిపారు. చర్మ వైద్యుడి పర్యవేక్షణలో బైడెన్ చికిత్స కొనసాగించనున్నట్లు వైట్‌హౌజ్ తెలిపింది.
80 ఏళ్ల బైడెన్‌కు ఫిబ్రవరిలో చర్మ పరీక్ష చేశారు. అయితే ఆయన డ్యూటీ చేసేందుకు ఫిట్‌గా ఉన్నారని వైట్‌హౌజ్ తెలిపింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో బైడెన్‌కు చికిత్స జరిగిందని, ఆయన ఛాతిలో ఉన్న చర్మ కణతి(Skin Lesion)ని తొలగించినట్లు డాక్టర్లు చెప్పారు.