Politics

జగన్ తో పొలిటికల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్. చంద్రబాబు.

జగన్  తో పొలిటికల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్. చంద్రబాబు.

తెలుగు దేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు, ఇతర లీగల్ సెల్ నేతలు

వైసిపి పై పొలిటికల్ ఫైట్ తో పాటు లీగల్ ఫైట్

అధికార దుర్వినియోగాన్ని న్యాయవాదులు అడ్డుకోవాలి

నేడు అండగా నిలిచే ప్రతి అడ్వకేట్ కు అధికారం లోకి వచ్చిన తరువాత ప్రాధాన్యం:-సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం:-

• ప్రభుత్వ అక్రమ కేసుల నుంచి నాలుగేళ్లుగా టీడీపీ నేతలను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతున్న అడ్వకేట్లకు వందనాలు

• చరిత్రలో అడ్వకేట్లకు పాత్ర ఎప్పుడూ కీలకమే. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో కూడా లాయర్లు కీలక పాత్ర పోషించారు

• ధనవంతులు కాదు… విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలనేది టీడీపీ సిద్దాంతం.

తొలి ఎన్నికల్లో 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 125 గ్రాడ్యుయేట్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు టిడిపి టిక్కెట్లు ఇచ్చింది.

• ఏకంగా 47 మంది అడ్వకేట్లకు టిడిపి నాడు టిక్కెట్లు ఇచ్చింది. యనమల, బాలయోగి, ఎర్రం నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా అనంద్ బాబు వంటి వాళ్లు లాయర్లు గా పనిచేశారు. ఒకప్పుడు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల ఇప్పుడు ఎంపిగా ఉన్నారు.

• నేను 1978 నుంచి శాసన సభ్యుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు.

• 40 ఏళ్లలో అనేక పోరాటాలు చేశాము..కానీ ఇంత దారుణ పాలన ఎప్పుడూ చూడలేదు.

• వైసిపి అరాచక పాలన వల్ల అడ్వకేట్లకు మాత్రం పని దొరుకుతుంది. ఇతర వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయి.

• ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి బాధ ఇప్పుడు విన్నాం. డ్రైవర్ ను చంపి ఇంటికి బాడీ తెచ్చింది కాక…అంత్యక్రియలకు డబ్బులు ఇస్తాం అని చెప్పారు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూడండి.

• బాధిత సుబ్రహ్మణ్యం కుటుంబ తరుపున సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడం.

• ఎస్ సి వ్యక్తిని చంపిన నేతను వైసిపి నేతలు జైలు నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

• పల్నాడులో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను అత్యంత కిరాతకంగా చంపారు. జై జగన్ అంటే వదిలేస్తాం అని హంతకులుచెప్పినా చంద్రయ్య వెనక్కి తగ్గలేదు. జై తెలుగుదేశం అంటూ నే ప్రాణాలు విడిచాడు.

• ఇలా ఒక్కటని కాదు అనేక అరాచకాలు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టుతో అరాచకాలు మొదలు పెట్టారు. అనునిత్యం రాష్ట్రాన్ని రావణ కష్ఠం చేశారు.

• నంద్యాలలో ముస్లి సోదరుడు సలాం ను వేధించి చంపాడు. ఇలా అనేక ఘటనలు జరిగాయి.

• కార్యకర్తలు నేడు దైర్యంగా పోరాటం చేస్తున్నారు అంటే దానికి బలమైన టీడీపీ లీగల్ సెల్ సభ్యులే కారణం. మీ అండతోనే కార్యకర్తలు ఫైట్ చేస్తున్నారు.

• నేను కుప్పం వెళితే అడ్డుకున్నారు….అమరావతి వెళితే కొందరు దాడి చేస్తే…దాన్నీ డీజీపీ సమర్థించారు.

• పల్నాడులో వైసిపి అరాచకాలతో గ్రామల నుంచి ప్రజలను తరిమేశారు…వారి కోసం గుంటూరులో క్యాంప్ పెట్టాం. వారిని సొంత ఊళ్లకు తీసుకువెళ్లాలి అని ప్రయత్నం చేస్తే నా ఇంటి గేటుకు తాళ్లు కట్టారు.

• ప్రజా స్వామ్య దేశంలో తరిమేసిన గ్రామస్థులను సొంత ఊళ్లకు తీసుకు వెళ్లలేని పరిస్థితి కల్పించారు.

• నన్ను వైజాగ్, తిరుపతిలో పలు మార్లు అడ్డుకున్నారు. నన్నే ఇలా అడ్డుకున్నారు…ఇక సామాన్య కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి

• కేసుల విషయంలో 41 ఎ నోటీసు ఇచ్చే పరిస్థితి తీసుకురావడానికి అడ్వకేట్ల చొరవ, పోరాటం కారణం. దీంతో ఇప్పుడు కేసుల్లో ముందు నోటీసు ఇవ్వాల్సి వస్తుంది.

• తెలుగు దేశం వాళ్లే బాధితులు, మళ్లీ వారిపైనే తప్పుడు కేసులు. ఇంత నీచమైన రాజకీయం నేను ఎప్పుడూ చూడలేదు. వీళ్లు ఎన్ని చేసినా అంతమ విజయం తెలుగు దేశం పార్టీదే.

• తీవ్రవాదులను, ఫ్యాక్షనిస్టులను, మత ఘర్షణలను అణిచివేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ.

• ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఊరికో సైకో తయారు అయ్యాడు.

• అవేదనతో ఎవరైనా వైసిపి నేతలు నిజం మాట్టాడితే వారిపైనా దాడులు, కేసులు పెడుతున్నారు.

• ఎంపి రఘురామ రాజు ను, సుబ్బారావు గుప్తాను ఎలా వేధించారో చేశాం.

• సుబ్బారావు గుప్తా విమర్శలు చేశాడు అని అతని వాహనంలో గంజాయిపెట్టి అక్రమ కేసు పెట్టారు. తెనాలి లో లిక్కర్ ఇంట్లో పెట్టి అక్రమ కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి.

• నేను కందుకూరు వెళితే సభకు పోలీసుల రక్షణ ఇవ్వలేదు. లోకేష్ యువగళం యాత్ర చేస్తుంటే మూడు రోజులకు ఒక కేసు పెడుతున్నారు. రాష్ట్రంలో పర్యటనలకు వెళుతుంటే జీవో నెంబర్ 1 తెచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారు.

• గత నెలలో జగ్గంపేట, పెద్దాపురంలో మీటింగ్ లు పెట్టుకుంటే సక్సెస్ అయ్యాయి. దీంతో నేను అనపర్తి సభకు వెళుతుంటే అడ్డంకులు సృష్టించారు.

• అనేక అడ్డంకులు సృష్టిస్తే అన్ని దాడుకుని సహాయ నిరాకరణ పేరుతో అనపర్తి సభ నిర్వహించాను.

• ఇప్పుడు ప్రజలు తమ హక్కులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు న్యాయ పోరాటం చేయాలి.

• బ్రిటిష్ వాళ్లు కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదు. సిఐడి అధికారి సునీల్ కుమార్ ఎంత దారుణాలు చేసారో చూశాం.

• అడ్వకేట్లు సమాజంలో అన్యాయంపై గట్టిగా పోరాడాలి. మీరు మీ క్లయింట్ ను కాపాడడానికి ఎంత దూరం అయినా వెళ్లవచ్చు.

• ఒక సారి వైఎస్ఆర్ ఒక అంశంలో నన్ను ప్రశ్నిస్తే….గెటవుట్ అని నా హక్కుల గురించి చెప్పి బయటకు పంపాను.

• నాపై రాజశేఖర్ రెడ్డి అనేక కేసులు వేశాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ధైర్యంగా అన్నీ ఎదుర్కొన్నాను.

• కానీ ఇప్పుడు జగన్ తప్పులు చెయ్యకుండానే కేసులు పెడుతున్నాడు.

• ఆర్కిటక్చర్ డైజెస్ట్ అనే మ్యాగజైన్ ప్రపంచంలోని గొప్ప నగరాలపై ఆర్టికల్ ప్రచురించింది. ఇందులో 6వ స్థానం అమరావతికి స్థానం దక్కింది.

• మనం పర్మినెంట్ కాకపోవచ్చు…కానీ రాష్ట్రం పర్మినెంట్ అనే ఉద్దేశ్యంతో పనిచేశాం

• సింగపూర్ అనేది నిజాయితీగా ఉండే దేశం. అక్కడ కారు డ్రైవర్ టిప్ కూడా తీసుకోరు. అమరావతి విషయంలో అలాంటి దేశంపై వైసిపి నేతలు ఆరోపణలు చేశారు.

• ప్రపంచంలో అవినీతి పరుడు అయిన జగన్….సింగపూర్ పై ఆరోపణలు చేశాడు.

• ప్రభుత్వం నరేగా డబ్బులు ఇవ్వకపోతే…అడ్వకేట్లు ఫైట్ చేసి డబ్బులు ఇప్పించారు.

• నాలుగేళ్లలో చాలా మీటింగ్ లు పెట్టాం…కానీ నేడు లాయర్లలో చాలా పట్టుదల కనిపిస్తుంది. జగన్ ను ఇంటికి పంపాలి అనే కసి అందరిలో కనిపిస్తుంది.

• నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తేలేకపోయిన సిఎం జగన్ రెడ్డి. దశాబ్దాల పాటు కష్టపడి ఆస్తులు సంపాదించుకున్న ప్రజలను బెదిరించి ఆస్తులు రాయించుకుంటున్నారు.

• ఒక్క విశాఖలోనే 40 వేల కోట్ల విలువైన ఆస్తులు రాయించుకున్నారు.

• ప్రజల తరుపున పోరాటానికి టీడీపీ సిద్దంగా ఉంది…వారికి అడ్వకేట్లు అండగా ఉండాలి.

• జగన్ అధికారంలో ఉంటే రాష్ట్రం ఏమవుతుంది…ప్రజల ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంది అనేది అంతా ఆలోచన చెయ్యాలి

• పొలిటికల్ రౌడీయిజాన్ని అణగదొక్కడం నాకు పెద్ద లెక్కకాదు. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేయడం ఖాయం

• వైసిపి నేతల అరాచకాలకు వడ్డీతో సహా అంతా చెల్లిస్తాం. తప్పు చేసిన ప్రతి అధికారిని బోను ఎక్కించడం ఖాయం.

• ఖాకీ బట్టలు వేసుకుని తప్పుడు పనులు చేస్తే చూస్తూ ఊరుకోం. బయపడే పరిస్థితి ఉండదు.

• పోరాటం చేద్దాం….అన్ని శక్తులు కూడదీసుకుని పోరాడుదాం. శ్రీరాముడు శక్తి లేక కాదు అందరి సాయం తీసుకుంది. నాడు ఉడతల సాయం కూడా తీసుకున్నాడు శ్రీరాముడు.

• జగన్ రెడ్డి నైతికంగా పతనం అయ్యాడు. ఎప్పుడో ఓడిపోయాడు. ఇంకా బుకాయిస్తే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు.

• నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద లీగల్ మీటింగ్ పెట్టడం మొదటి సారి.

• ఈ 5 ఏళ్లు ఏ లాయర్లు అయితే టీడీపీ కి అండగా ఉన్నారో…అధికారంలోకి వచ్చిన తరువాత వారికి న్యాయం చేస్తాం.

• ఇప్పుడు నాతో నిలబడిన వారికి అందరికీ భవిష్యత్ లో న్యాయం చేస్తాను.

• కోర్టు వారీగా, నియోజకవర్గం వారీగా కూడా లీగల్ సెల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.

• నేను చాలా సార్లు నామినేషన్లు వేశాను. మా అడ్వకేట్లు ఆ పని చూసేశారు. కానీ ఇప్పుడు ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. నామినేషన్లు వేసే సమయంలో ఇవన్నీ మనం పేర్కొనాల్సి ఉంది.

• విచిత్రం ఏంటంటే….యువగళంలో 12 కేసులు పెడితే…9 కేసులు పోలీసులే పెట్టారు.

• రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్రమాలకు తెరతీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు.

• డాక్యుమంట్లు ఫోర్జరీ చేసి గ్రాడ్యుయేట్ల పేరుతో దొంగ ఓట్లు తయారు చేశారు.

• దొంగ సర్టిఫికెట్లతో గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేసిన వారిని, ఓటు వేసిన వాడినీ జైలుకు పంపవచ్చు.

• రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్ గా తీసుకోండి. అడ్వకేట్లు వైసీపీ అక్రమాలు బయట పెట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి.

• ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు వేస్తే…ఆ నామినేషన్లు చెల్లవని వాటిని ఇన్ వాలీడ్ చేస్తున్నారు.ఇలాంటి చోట అడ్వకేట్ల పాత్ర కీలకం.

• ఈ నాలుగేళ్లు పెట్టిన అక్రమ కేసులు బయటకు తీద్దాం…వాటిపై ఎలా ముందుకు వెళ్లాలి అనేది చూద్దాం. వాటిపై కోర్టుకు వెళ్లి క్వాష్ చేసేలా ప్రయత్నం చేద్దాం. తప్పుడు కేసుల పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయాల్సి ఉంది.

• నియోజకవర్గ నేతలు, అడ్వకేట్లు సమన్వయంతో వ్యవహరించాలి. పార్టీలోని అన్ని విభాగాలకంటే లీగల్ వింగ్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం.

• మన వాళ్లను మనం రక్షించుకోవడంతో పాటు…రానున్న రోజుల్లో ఏం చెయ్యాలి ప్రణాళిక రచించుకోవాలి

• పొలిటికల్ ఫైట్ తో పాటు…లీగల్ ఫైట్ కూడా చేయాల్సి ఉంది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుందాం.

• ఓటర్ల వెరిఫికేషన్ తో పాటు…ఎన్నికల సమయంలో నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా అడ్వకేట్లు సహకరించాలి

• సాధారణ ఎన్నికకప్పుడు వైసిపి అనేక అక్రమాలకు తెరతీస్తుంది…వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్దంగా ఉండాలి.

• 175 నియోజకవర్గాలకు 1-3తో అడ్వకేట్ల బృందం ఏర్పాటు చేసుకోవాలి.

• న్యూట్రల్ గా ఉండే అడ్వకేట్ల సహకారం తీసుకోవాలి. వారూ న్యాయం కోసం పని చెయ్యాలి.