Politics

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..

కాంగ్రెస్‌ (Congress) మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో చేరారు..

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది.

గురువారమే ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. కాగా.. 76 ఏళ్ల సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రిలో చేరడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ కారణంగా జనవరిలో ఆమె ఆసుపత్రిలో చేరి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నారు.