అదితీరావు హైదరీ.. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. మిగిలిన భాషల్లో కూడా సినిమాలతో దూసుకుపోతోంది. కానీ, సరైన హిట్లు అందుకుని చాలా రోజులు అవుతోంది. ఈమె తాజాగా జీ5 ఒరిజినల్స్ తాజ్ డివైడెడ్ బై బ్లడ్ అనే వెబ్ సిరీస్ లో అనార్కలీగా సందడి చేసింది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఆమె వ్యక్తిగత జీవితం గురించే ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె ఓ హీరోతో రిలేషన్ లో ఉందని, వాళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. శర్వానంద్ పెళ్లికి ఇద్దరూ కలిసి అటెండ్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కానీ, ఇప్పుడు అదితి వారి రిలేషన్ గురించి భిన్నంగా స్పందించింది.
అదితీరావు హైదరీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే సిద్ధార్థ్ కి కూడా టాలీవుడ్ చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే వీరిద్దరికి సంబంధించిన ఏ వార్త అయినా తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగానే వైరల్ అవుతుంటుంది. మహాసముద్రం సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత వీరి మధ్య రిలేషన్ పెరిగి డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిని వీళ్లు బాహాటంగా ఖండించింది లేదు. శర్వానంద్ పెళ్లిలో వీళ్లు కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తర్వాత ఎప్పుడూ లేనిది అదితి తన ఇన్ స్టాగ్రామ్ లో సిద్ధార్థ్ తో కలిసి చేసిన రీల్ ని పోస్ట్ చేసింది.
ఇంక వీళ్ల పెళ్లి ఖాయమే అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితీని సిద్ధార్థ్ తో పెళ్లి గురించి ప్రశ్నించారు. అందుకు ఆమె “నేను ఎవరితో రిలేషన్ లో ఉన్నాను? నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను? అనే విషయాల గురించి కాకుండా మనం సినిమాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. నాకు మంచి సినిమాలు చేయడం అంటే ఇష్టం. నేను అలాంటి సినిమాలు చేసేందుకు చాలా కష్టపడుతున్నాను. కాబట్టి నా సినిమాలకు సంబంధించి మీరు ప్రశ్నిస్తే బావుంటుంది” అంటూ అదితీరావు సమాధానం చెప్పింది. ఆమె ఆన్సర్ చూసిన నెటిజనులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే మీరు నిజంగానే లవ్ లో లేరా? డేటింగ్ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అదితీ రావు సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.