ప్రముఖ సినీనటి శ్రీమతి మీనా గారి సినీరంగ ప్తస్థానం 40 ఏండ్లు పూర్తిచేసుకొన్న సంధర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం “మీనా 40” లో పాల్గొన్న మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా శెల్వమణి దంపతులు!
ఈ కార్యక్రమంలో సినీరంగానికి చెందిన ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు హాజరైనారు.
ఈ సంధర్భంగా మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మాట్లాడుతూ.. మీనా గారి 40 ఏండ్ల నట ప్రస్థానం గురించి వివరించి, ఆమెతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకొన్నారు.
సినీరంగం నుంచి వచ్చి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన శ్రీమతి ఆర్.కె.రోజా గారు మరియూ తమిళ సూపర్ స్థార్ రజనీకాంత్ లు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దక్షీణ భారతదేశానికి చెందిన ప్రముఖ సినీరంగ ప్రముఖులంతా హాజరవడంతో అభిమానుల సందడితో కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది!