NRI-NRT

దుబాయ్ లో కెసిఆర్ పై నిప్పులు చెరిగిన ఎంపీ అరవింద్.

దుబాయ్ లో  కెసిఆర్ పై నిప్పులు చెరిగిన ఎంపీ అరవింద్.

బుర్జ్ ఖలీఫాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇండ్లు కొనుక్కోంటూ తెలంగాణ నాయకులు కొందరు ధనవంతులయితె పేద ప్రజలు మాత్రం గూడు కొరకు విదేశాలకు వస్తున్నారని నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.

దుబాయిలోని అల్ ఖోజ్ లో ఆదివారం రాత్రి జరిగిన సదూర తీరాన సింధూర కెరటాలు అనే ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో పాటుగా విదేశాలలో ఉంటున్న తెలంగాణ బిడ్డలను కూడ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తన శుష్క వాగ్దానాలతో దగా చేసారని విమర్శించారు.

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ దేశాలలోని ప్రవాసీయుల సమస్యలన్ని కూడ పరిష్కారం చేస్తామని ఆయన హామనిచ్చారు.

ప్రవాసీ భీమా యోజన పథకం క్రింద గల్ఫ్ ప్రవాసీయుల దాదపు సమస్యలకు పరిష్కారం ఉందని కానీ దీన్ని క్షేత్రస్ధాయిలో ప్రచారం చేసి అమలు చేయడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ యంపి విమర్శించారు. కేవలం 275 రూపాయాలతో భీమా క్రింద ప్రవాసీయులకు మరియు స్వదేశంలోని వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు గల్ఫ్ లో న్యాయ సహాయం వరకు అన్ని రకాల ముఖ్య సేవలను కేంద్రం అందిస్తుందని ఆయన వివరించారు. మోదీ ప్రధాని గా కాకుండ ఒక పేదవాడిగా అలోచించడంతో మాత్రమే ఈ రకమైన సేవలను ప్రవాసీ భీమా యోజన క్రింద తీసుకోవచ్చారని బిజెపి నాయకుడు అన్నారు.

యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.యఫ్) లో చేరడం ద్వార ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతి నిర్మాణానికి తోడ్పాడలని అరవింద్ ప్రవాసీయులకు విజ్ఞప్తి చేసారు.

ఒక రకంగా చెప్పాలంటె గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఎదుర్కోంటున్న సమస్యలు అసలు సమస్యలె కావని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉండాలని అరవింద్ పెర్కోన్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తన కాల్ సెంటర్ ద్వార వేలాది మందికు తాను ఒక్కడ్ని సహాయం చేయగల్గినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయరాదని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల నుండి తాను ఇప్పటి వరకు 4 వేల 700 తెలంగాణ ప్రవాసీయులను స్వదేశానికి రప్పించానని, అదే విధంగా తన ఫౌండెషన్ ద్వార 1700 మంది రోగులకు వైద్య సహాయం అందించానని అరవింద్ అన్నారు.

దుబాయిలో రాజకీయ పార్టీల పేరు ప్రస్తావించ రాదని కానీ తాను ఎవరి గూర్చి మాట్లాడుతున్నానో మీకందరికి అర్ధమయి ఉంటుందని చెబుతూ ఆయన పరోక్షంగా విమర్శలు చేసారు. 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యాపారం చేసే తెలివి లేక ఖరీదయిన గడియారం కొనుక్కోలేదని కానీ “అమె” భర్త మాత్రం 20 లక్షల గడియారం కొనుక్కోనెంత వ్యాపారం చేస్తున్నాడని ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేసారు.

అమె జైలుకు వెళ్ళాలా వద్దా అని ఆయన సభా ముఖంగా ప్రశ్నించగా వెళ్ళాలంటూ కొందరు యువకులు నినాదాలిచ్చారు.

బిజెపి కేంద్ర కార్యాలయంలో విదేశీ వ్యవహారాల విభాగం నెలకోల్పడం జరిగిందని అందులో నలుగురు సభ్యులుండగా దక్షిణాది రాష్ట్రాల నుండి తనను ఎంపిక చేసారని అరవింద్ తెలిపారు.

ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐ.పి.యఫ్) తెలంగాణ విభాగం నిర్వహించిన ఈ సమావేశానికి ఆశించిన దాని కంటె ఎక్కువ స్పందన లభించినట్లుగా నిర్వహకులు తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ ప్రవాసీయుల నుండి అనూహ్యమైన స్పందన లభించిందని వారు పెర్కోన్నారు.

సభ జరుగుతుండగా, నమాజు వేళ కావడంతో అజాన్ మోదలు కాగ ప్రధాని మోదీ తరహా తాను కూడ నమాజును గౌరవిస్తూ ప్రసంగాన్ని ఆపుతున్నట్లుగా ప్రకటించి ఆజాన్ జరిగినంత వరకు మౌనంగా ఉన్నారు. కార్యక్రమానికి బిజెపి విదేశీ వ్యవహారాల శాఖ విభాగం అధిపతి విజయ చౌత్వాలే ముఖ్య అతిథిగా హాజరు కాగ ఇండియన్ పీపుల్స్ ఫోరం యు.ఏ.ఇ అధ్యక్షుడు జితేంద్ర వైద్య అధ్యక్షత వహించగా ఫోరం ప్రధాన కార్యదర్శి రంజీత్ కోడోత్ అతిధిగా పాల్గోనగా ఫోరం తెలంగాణ విభాగం అధ్యక్షుడు కుంభాల మహేందర్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేసారు.

సమావేశ నిర్వహణను కటుకం రవి, వంశీ గౌడ్, నవనీత్ పటేల్, శరత్ గౌడ్, మదన్, జగదీశ్, గోవర్ధన్, వినోద్ ఆర్మూరీ, కోరేపు మల్లేష్, పెంకుల ఆశోక్ తదితరులు సమన్వయం చేసారు.

మిషన్ తెలంగాణలో భాగంగా ఎడారి దేశాలలో ఉంటున్న ప్రవాసీయులను లక్ష్యంగా చేసుకోని వారి కుటుంబాలకు చెరువ కావడానికి బిజెపి వ్యూహాత్మకంగా ముందుకెళ్తుండగా అందులో ప్రవాసీయులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అరవింద్ క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు.