Movies

సానియా మీర్జా పదవీ విరమణ పై… స్పందించిన రామ్ చరణ్

సానియా మీర్జా  పదవీ విరమణ పై… స్పందించిన రామ్ చరణ్

టెన్నిస్ కోర్ట్‌లు సానియా ఆటను మిస్ అవుతాయన్న రామ్ చరణ్
మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారంటూ ట్వీట్
ఉపాసనతో కలిసి సానియాతో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ స్టార్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన సొంతగడ్డ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్‌ ద్వారా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించింది. ఆదివారం ఎల్బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లోనూ సానియా జోడీ విజేతగా నిలిచింది.

తన సుదీర్ఘ కెరియర్ తో ఎన్నో ఘనతలు సాధించిన, దేశంలో టెన్నిస్ కు ఎంతో ప్రచారం తీసుకొచ్చిన సానియాకు అన్ని వైపుల నుంచి వీడ్కోలు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ హీరో రామ్ చరణ్ కూడా స్పందించారు.

‘‘నా ప్రియ మిత్రమా సానియా మీర్జా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్ట్‌లు మీ ఆటను మిస్ అవుతాయి. భారతదేశంలో క్రీడలకు మీరు అందించిన సహకారం ఎనలేనిది. మీరు మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారు’’ అని చరణ్ ట్వీట్ చేశారు.

ఉపాసనతో కలిసి సానియాతో దిగిన ఫొటోను చరణ్ ట్వీట్ చేశారు. దంపతులిద్దరూ చెరో పక్కన ఉండగా.. మధ్యలో సానియా ఉన్న ఫొటో చాలా క్యూట్ గా ఉంది. చరణ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ రీట్వీట్లు, కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు.