NRI-NRT

తానా ఎన్నికలు. ప్రచారం ప్రారంభించిన కొల్లా అశోక్.

తానా ఎన్నికలు. ప్రచారం ప్రారంభించిన కొల్లా అశోక్.

తానా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికలలో తానా కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన ప్రస్తుత కోశాధికారి కొల్లా అశోక్ బాబు తన ప్రచారాన్ని ప్రారంభించారు. గత 14 సంవత్సరాల నుండి తానాకు వివిధ హోదాలలో తాను చేసిన సేవలు గురించి వివరిస్తూ బ్రోచర్లను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి కార్యదర్శి పదవికి ఎంపిక చేయాలని తానా సభ్యులను అశోక్ బాబు కోరుతున్నారు.