Fashion

కొత్త ఫ్యాషన్ ట్రాండ్ …టిక్‌..టిక్‌..టిక్‌ !

కొత్త ఫ్యాషన్ ట్రాండ్  …టిక్‌..టిక్‌..టిక్‌ !

సమయానికి తగిన ఫ్యాషన్‌ ఫాలో కావాలనే అనుకుంటారు ఎవరైనా. కానీ, ఫ్యాషన్‌ మాత్రం సమయంతో పోటీ పడుతూ ఉంటుంది. కాలమంత వేగంగా మారిపోతూ ఉంటుంది.

సమయానికి తగిన ఫ్యాషన్‌ ఫాలో కావాలనే అనుకుంటారు ఎవరైనా. కానీ, ఫ్యాషన్‌ మాత్రం సమయంతో పోటీ పడుతూ ఉంటుంది. కాలమంత వేగంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టే, కాలాన్నీ ఫ్యాషన్‌నూ ఓ చోటుకు చేర్చి.. వాచ్‌ ఇన్‌స్పైర్డ్‌ జువెలరీ తయారు చేస్తున్నారు డిజైనర్లు.

పట్టుచీర కట్టుకోవాలన్నా, నగలు పెట్టుకోవాలన్నా సమయమూ సందర్భమూ కలిసిరావాలి. జీన్సుకూ వేళాపాళా అవసరమే. కానీ వీటన్నిటినీ టైమ్‌కి తగినట్టు పాటించాలంటే మన దగ్గర ఓ వాచ్‌ అంటూ ఉండాలి. అది చేతికే ఉండాలా, మెడలో ఉండకూడదా? చెవి దుద్దుగా అమరిపోకూడదా? వేలి ఉంగరంలో ఇమిడిపోకూడదా?.. అందుకే ముద్దుగుమ్మ చెవికి అందాల కమ్మగా, నాజూకైన వేలికి ముద్దులొలికే అంగుళీకంలా, సింగారాల మెడలో బంగారు లాకెట్‌లా… అందమైన వాచీలు దర్శనమిస్తున్నాయి. ఈ టిక్‌ టిక్‌ సొగసులు.. కనికట్టు చేసి మరీ ఎదుటివాళ్లు కాలాన్ని మరిచిపోయేలా చేస్తున్నాయి. రాళ్లూ పూసలతో పార్టీలుక్‌ తెచ్చే వాచీలూ ఉన్నాయి. మనం కొనుక్కునేందుకే కాదు, బహుమతిగా ఇచ్చేందుకూ బాగుంటాయి. కాబట్టి మీరూ టైమ్‌ చూసి పడేయండి… ఓ ఆర్డరు!