Politics

రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల..

రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల..

మహానేత YSR పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం.

– చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా?

– మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా?

– ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి
మాట్లాడే నైతిక హక్కు లేదు.

– పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు.

-. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి.

– కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు.

-. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు.

-.ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు.

-. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ.

– ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే.