Health

ఫ్లూ పంజా! హైదరాబాద్‌లోనూ పెరుగుతున్న బాధితులు

ఫ్లూ పంజా! హైదరాబాద్‌లోనూ పెరుగుతున్న బాధితులు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు

హైదరాబాద్‌లోనూ భారీగా రోగులు!

ప్రతి నలుగురిలో ఒకరికి లక్షణాలు

నిరంతర దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్య

‘ హెచ్‌3 ఎన్‌2’ వైరస్‌ కారణమని గుర్తింపు

చేతులు కడగండి.. మాస్క్‌లు ధరించండి

కరచాలనాలు, ఆలింగనాలు ఆపివేయండి

హెచ్చరికలు జారీ చేసిన ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ,: ఓ పట్టాన తగ్గని జ్వరం.. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు..! కోలుకునేందుకు సాధారణం కంటే అధిక సమయం పడుతోంది..! దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతోంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ వైర్‌సతో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తాజా కేసులకు చాలావరకు ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉప రకం ‘హెచ్‌3ఎన్‌2’ వైరస్‌ కారణమని గుర్తించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇతర ఉప రకాలతో పోలిస్తే ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువని, దీంతో ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయని పేర్కొంది.