Health

3 రోజుల్లో 20 వేల మందికి జ్వరాలు

3 రోజుల్లో 20 వేల మందికి జ్వరాలు

రాష్ట్రంలో ఈనెల 5 నుంచి 7 మధ్య 20వేల జ్వరాల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో రోగులు బాధపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా A వైరస్లోని H3N2 సబ్ వేరియంట్ వల్లే వైరల్ జ్వరాలు అధికమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాంటీ బయాటిక్స్ వాడొద్దని, ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలని, నోరు, ముక్కును పదేపదే తాకొద్దని, తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.